»   » బ్రహ్మానందం... వీకెండ్ వెంకట్రావ్

బ్రహ్మానందం... వీకెండ్ వెంకట్రావ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కామెడీ కింగ్ బ్రహ్మానదం లేని తెలుగు పెద్ద సినిమా ఊహించలేని స్ధితికి వచ్చింది. ముఖ్యంగా కామెడీలు రాజ్యం ఏలుతున్న ఈ సమయంలో బ్రహ్మానందం రకరకాల గెటప్ లలో, పేర్లతో స్క్రీన్ పై నవ్వులు కురిపిస్తూ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిస్తున్నాడు. మొన్నామధ్య నాయక్ చిత్రంలో జిలేబిగా కనిపించి, తర్వాత కిల్ బిల్ పాండేగా రేసుగుర్రంలోనూ... రీసెంట్ గా అల్లుడు శ్రీను చిత్రంలో డింపుల్ గా కనిపించిన బ్రహ్మానందం ఆ మధ్యన లౌక్యం... ఇప్పుడు సిప్పీగా మరోసారి నవ్వించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా రామ్ తాజా చిత్రం పండుగ చేస్కో లో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రతో మరో సారి తన ట్రేడ్ మార్క్ ని చూపించి సినిమాకు ప్లస్ అవనున్నాడని తెలుస్తోంది. 

ఇప్పటికే 950కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో 1000 చిత్రాల మార్కును దాటబోతున్నారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం ప్రత్యేకత. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

Now, Brahmanandam turned as Weekend Venkat Rao

'పండగ చేస్కో' విషయానికి వస్తే..

ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని.

ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌, రకుల్‌, సోనాల్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

ఫిబ్రవరి 3 వరకూ హైదరాబాద్‌లోనే షూటింగ్‌ సాగుతుంది. ఆ తరవాత 'పండగ చేస్కో' బృందం రాజమండ్రి వెళ్తుంది. అక్కడ పచ్చటి పరిసరాల మధ్య ఓ కీలక షెడ్యూల్‌ని తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
As per reports Brahmanandam going to appear as ‘Weekend Venkata Rao ‘ in hero Ram’s forthcoming film Pandaga Chesko.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu