హాట్ న్యూస్ : ఎన్టీఆర్,త్రివిక్రమ్ తో ఎన్నారై చిత్రం
హైదరాబాద్ : జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా దాదాపు ఖరారైయినట్లే అని తెలుస్తోంది. ఓ ఎన్నారై ఈ చిత్రాన్ని భారీగా నిర్మించాటనికి ముందుకొచ్చాడని సమాచారం. ఎన్టీఆర్ బాద్షా ఫినిష్ అయిన వెంటనే ఈ చిత్రం గురించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ కూడా ఈ లోగా తను పవన్ తో చేయబోయే చిత్రం పూర్తి చేసుకుని వస్తారు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ జూనియర్‌ను తనదైన డిఫరెంట్ స్టయిల్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో ఓ టీవీ యాడ్ రూపొందింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నవరత్న టాల్క్ యాడ్‌లో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య సినిమా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ ఓకే అయింది. తర్వలో ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తు ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
మరో వైపు ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.
ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే... ఇటీవలే జులాయి మూవీతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సరదా అనే వర్కింగ్ టైటిల్ తో వ్యవహిస్తున్నారు. జల్సా తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ పై ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











