»   » ఎన్టీఆర్ ని ఫ్లాట్ చేసే కథ చెప్పి ఒప్పించిన..

ఎన్టీఆర్ ని ఫ్లాట్ చేసే కథ చెప్పి ఒప్పించిన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సింహా విజయంతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన బోయపాటి కి వెంటనే ఎన్టీఆర్ నుంచి ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కి బోయపాటి చెప్పిన కథ ఎక్కలేదని, కంగారు..కంగారుగా బోయపాటి వంటిన వన్ లైన్ ఆర్డర్ ని నిర్విర్ధంగా ఎన్టీఆర్ తిరస్కరించినట్లు వినపడింది. అయితే తాజాగా బోయపాటి ఎన్టీఆర్ ని కలిసి కథను దాదాపు రెండు గంటల సేపు నేరేట్ చేసాడని, అది విన్న ఎన్టీఆర్ ప్లాట్ అయినట్లు చెప్తున్నారు. అందులోనూ ఎన్టీఆర్ కి హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు బోయపాటి చెప్పిన తీరు బాగా నచ్చి..నిర్మాత కె.ఎస్.రామారావు వెంటనే ఫోన్ చేసి సినిమా మంచి హిట్ అవుతుందని మిగతా పనులు రెడీ చేసుకోమని చెప్పారని సమాచారం. ఎన్టీఆర్ నటించిన 'బృందావనం" అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రంలో నటిస్తున్నాడు. 'శక్తి" పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu