»   » స్పైడర్ నష్టాలతో దిల్ రాజు బేజారు.. గట్టెక్కించడానికి రంగంలోకి ఎన్టీఆర్

స్పైడర్ నష్టాలతో దిల్ రాజు బేజారు.. గట్టెక్కించడానికి రంగంలోకి ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dil Raju Made Plan To Come Out From The "Spyder" Loses రంగంలోకి దిగిన ఎన్టీఆర్

అగ్రహీరోల చిత్రాలను భారీ మొత్తం చెల్లించి పంపిణీ చేయడంలో దిల్ రాజుకు పెట్టింది పేరు. దసరా సీజన్‌లో దిల్ రాజు పంపిణి చేసిన చిత్రాల్లో జై లవకుశ, స్పైడర్, మహానుభావుడు చిత్రాలు ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న పవన్ కల్యాణ్ చిత్రానికి సంబంధించిన హక్కులను కూడా ఈయనే దక్కించుకొన్నారు. తాజా పరిస్థితుల్లో జై లవకువ, మహానుభావుడు చిత్రాలు మోస్తారు లాభాలాను సంపాదించిపెట్టాయి. కానీ స్పైడర్ చిత్రమే భారీ నష్టాలను మిగిల్చింది. అయితే స్పైడర్ కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజును కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ భరోసా ఇచ్చినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త ప్రచారం అవుతున్నది.

24 కోట్లకు స్పైడర్!

24 కోట్లకు స్పైడర్!

మురుగదాస్, మహేశ్ బాబు క్రేజీ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ మొత్తానికి స్పైడర్ నైజాం పంపిణీ హక్కులను దక్కించుకొన్నాడు. దాదాపు 24 కోట్లకు ఈ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

స్పైడర్ కలెక్షన్లు బేర్

స్పైడర్ కలెక్షన్లు బేర్

స్పైడర్ సినిమాపై తొలి ఆట నుంచే ప్రతికూల స్పందన వ్యక్తం కావడంతో తొలి రెండు రోజుల తర్వాత కలెక్షన్లు బేర్ మన్నాయి. ప్రస్తుతం దిల్ రాజుకు 10 కోట్లకు పైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందట.

10 కోట్లు బొక్కపడే

10 కోట్లు బొక్కపడే

గత 8 రోజులుగా వచ్చిన కలెక్షన్ల ప్రకారం స్పైడర్ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఒకవేళ ఓవరాల్‌గా 14 కోట్లు కలెక్ట్ చేసినా దాదాపు 10 కోట్లు బొక్కపడే అవకాశం కనిపిస్తున్నది.

ఎన్టీఆర్‌తో భారీ సినిమా

ఎన్టీఆర్‌తో భారీ సినిమా

స్పైడర్ మూలంగా వచ్చిన భారీ నష్టాలను పూడ్చుకోవడానికి దిల్ రాజ్ ఓ ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది. మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎన్టీఆర్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజ్ ప్రపోజ‌ల్‌కు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తున్నది.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్

ఇదిలా ఉండగా, దిల్ రాజు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందించనున్నట్టు వచ్చిన సినిమాకు ప్రస్తుతం ఫ్లాప్‌లతో పరిశ్రమకు దూరమైన బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా? లేక నిజంగానే దిల్ రాజు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారా అనేది విషయం కొంతకాలం ఆగితే తెలియడం ఖాయం.

English summary
Tollywood's Ace Producer Dil Raju has distributed Spyder, Jai Lava Kusa, Mahanubhavudu movies in this dasara season. Report suggest that, Spyder given huge losses to Dil Raju. In this situation, Dil Raju made plan Produce a move with NTR to come out from the Spyder loses. This movie may be directed by Bommarillu Bhaskar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu