»   » జూ ఎన్టీఆర్ కు మామగారి నుంచి మరో కాస్టలీ గిప్ట్..

జూ ఎన్టీఆర్ కు మామగారి నుంచి మరో కాస్టలీ గిప్ట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్ళి కాకుండానే ఎన్టీఆర్ వరస బహుమతులను తన మామగారైన నార్నే శ్రీనివాసరావు నుంచి అందుకుంటున్నారు. తాజాగా ఆయన దాదాపు నలభై లక్షలు విలువ చేసే బిఎమ్.డబ్లూ టూ సీటర్ కారుని గిప్ట్ గా అందుకున్నారని సమాచారం. భవిష్యత్ లో ఆయన తన కూతురు, అల్లుడు మాత్రమే కూర్చుని వెళ్ళాలని ఆలోచించి ఈ కారుని ప్రెజెంట్ చేసి ఉండవచ్చునని అంటున్నారు. ఇక ఇప్పటికే..జూ ఎన్టీఆర్ కు కాబోయో మామ దాదాపు ఇరవై కోట్ల రూపాయల విలువైన ఇంటిని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు నుంచి కొనుగోలు చేసి గిప్ట్ గా ఇచ్చారు.

దాంతో తను ఉంటున్న మొహది పట్నం నుంచి నివాసాన్ని జూబ్లీహిల్స్ కు త్వరలోనే ఎన్టీఆర్ మార్చనున్నారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 31లో (ప్లాట్ నెంబర్ 512-ఎన్) లో ఉన్న విశాలమైన భవనం కొద్ది నెలల క్రితమే ఎన్టీఆర్ సొంతమైంది. ఇక ఎన్టీఆర్ తన పెళ్ళి గురించి ఆ మధ్య...నేను సాంప్రదాయక పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మా నాన్న వెతికి చూసిన సంబంధం ఇది. పెళ్లిలో నేను వేసుకునేవి కూడా సాంప్రదాయకమైన దుస్తులే. సూటూ బూటూ వేసుకుని చేసుకోను. అభిమానుల మధ్య పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ఎంతవరకు వీలవుతుందో చూడాలి. లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతుంటా కానీ కలవడం బాగా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu