»   » నృత్య ప్రధాన చిత్రంలో ఎన్టీఆర్

నృత్య ప్రధాన చిత్రంలో ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటినుంచి సంప్రదాయ నృత్య కళలను అభ్యసించిన ఆయన సినిమాల్లో ఎంత క్లిష్టమైన స్టెప్ అయినా సునాయిసంగా వేసి అందరినీ ఆనందపరుస్తూంటారు. ఈ నేపధ్యంలో ఆయన నృత్య ప్రధాన చిత్రం ఒకటి కమిటయ్యారని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు కె.విశ్వనాధ్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనేది చాలా మంది యువ దర్శకుల కల. అయితే ఎన్టీఆర్ ఓ సీనియర్ డైరక్టర్ కు డేట్స్ ఇచ్చారనేది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆ సీనియర్ దర్శకుడు మరెవరో కాదు కె.విశ్వనాధ్ గారు. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం చేయనున్నారంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమో కాదో కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

NTR getting ready for K Viswanath’s flick?

కొంతకాలం క్రితం ఎన్టీఆర్ తను సాగరసంగమం లాంటి చిత్రం లో చేయాలని ఉండాలని తనతో అన్నట్లు విశ్వనాథ్ గారు చెప్పారు. అయితే అప్పటి నుంచి ఈ కాంబినేషన్ పై ఎలాంటి ఆసక్తికరమైన వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఈ న్యూస్ బయిటకు వచ్చింది. విశ్వనాథ్ గారు ఇప్పటికే కథ చెప్పి ఒప్పించారని, లో బడ్జెట్ లో ఈ చిత్రం చేయాలని నృత్యం ప్రధానంగా ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు.

ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

‘టెంపర్' సినిమా ఘన విజయంతో సంతోషంగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తదుపరి సినిమాకు సంబందించిన పనులను వేగవంతం చేశారు. వైవిధ్యభరిత సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రియల్ నెలాఖరు నుండి ప్రారంభమవుతుంది.

యూకే నేపథ్యంలో కథ ఉంటుందని సమాచారం. మేజర్ పార్ట్ షూటింగ్ సైతం అక్కడే జరుపుతారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

NTR getting ready for K Viswanath’s flick?

నిర్మాత మాట్లాడుతూ.... ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది. సుకుమార్ శైలిలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ఆయన అభిమానులు కోరుకునే అంశాలన్నీ వుంటాయి. భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌లో వున్న పవర్‌ను ఆవిష్కరించే చిత్రమిది. ఆయనతో తొలిసారి పనిచేయడం ఆనందంగా వుంది. ప్రతీకార నేపథ్యంలో కథ వుంటుంది. ట్రీట్‌మెంట్ కొత్తగా వుంటుంది. స్టెలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల
ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.

ఈ చిత్రానికి టైటిల్ గా "దండయాత్ర" టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ టైటిల్ కాదని, "నాన్నకు ప్రేమతో..." అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి,కొడుకుల సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారని, అయితే ఎన్టీఆర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

English summary
NTR’s new movie under legendary K Viswanath’s direction will be materialise.
Please Wait while comments are loading...