»   »  కొరటాల శివకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ఎన్టీఆర్!

కొరటాల శివకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబద్: ‘మిర్చి' చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ....తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘శ్రీమంతుడు' భారీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ చిత్రం 80కోట్లకు పైగా షేర్ వసూలు చేయడంతో కొరటాల శివ తన రెండో సినిమాతోనే టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు.

‘శ్రీమంతుడు' రూపంలో తనకు భారీ హిట్ ఇచ్చినందుకు పొంగిపోయిన మహేష్ బాబు.... రూ. 50 లక్షలు విలువ చేసే ఆడి ఏ6 కారును గిఫ్టుగా ఇచ్చాడు. ప్రస్తుతం ‘జనతాగ్యారేజ్' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా కొరటాల శివ మరో ఖరీదైన గిఫ్టు అందుకున్నట్లు సమాచారం.

ఈ చిత్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ పని తీరు నచ్చి ఏకంగా 20 లక్షల విలువ చేసే వాచ్ గిఫ్టుగా ఇచ్చాడు. ఇంకా షూటింగే మొదలు కాలేదు అప్పుడే ఈ గిఫ్టు ఏమిటనుకుంటున్నారా? కొరటాల శివ స్క్రిప్టు వర్కుకు ముగ్దుడైపోయి ఎన్టీఆర్ ఈ గిఫ్టు ఇచ్చాడ. మరి సినిమా హిట్టయితే ఎన్టీఆర్ ఇచ్చే గిఫ్టు ఖరీదు ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

NTR gifted an expensive wrist watch to Koratala Siva?

అంతే కాదు... రెమ్యూనరేషన్ కూడా ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ ఎక్కువగా ఇప్పిస్తున్నారట. జనతా గ్యారేజ్ చిత్రం కోసం కొరటాల శివకు పది కోట్లు రెమ్యునేషన్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. నిర్మాతలు ఎనిమిది కోట్లు అంటే ఎన్టీఆర్ పట్టు పట్టి మరీ పది కోట్లు ఇప్పిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

మిర్చి చిత్రానికి 50 లక్షలు రెమ్యునేషన్ తీసుకుంటే...శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివకు నాలుగు కోట్లు రెమ్యునేషన్ ముట్టింది. దాంతో ఈ మొత్తం రెట్టింపు కన్నా ఎక్కువ కావటంతో కొరటాల శివ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మూడో సినిమాకే ఇలా పది కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవటం మామూలు విషయమేమీ కాదు.

ఈ స్దాయి రెమ్యునేషన్ ఇఫ్పటికే ఇండస్ట్రిలో రాజమౌళి, త్రివిక్రమ్, శ్రీను వైట్ల వంటి దర్సకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొరటాల శివ కూడా ఆ క్లబ్ లో చేరారు. శ్రీమంతుడు చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ఈ స్దాయి రెమ్యునేషన్ కు కారణం అంటున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

English summary
Film Nagar source said that, NTR recently gifted an expensive wrist watch worth 20 lakhs to Koratala Siva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu