»   » ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా ఎన్టీఆర్, ఆయనతో అనుబంధమే కారణం

ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా ఎన్టీఆర్, ఆయనతో అనుబంధమే కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్,పవన్ వంటి స్టార్స్ ఓ సినిమా ఆడియో పంక్షన్ కు వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో మనకి తెలియంది కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఓ డబ్బింగ్ సినిమా ఆడియో పంక్షన్ కు రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో మాట్లాడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకీ ఏ సినిమా అది...అంటారా..

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌- స్టార్ డైరక్టర్ ప్రియదర్శన్‌ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఒప్పం'. ఈ చిత్రం మలయాళంలో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం అందుకుంది. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆశీర్వాద్ సినిమాస్, వ‌న్ ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా అందిస్తున్న‌ క‌నుపాప చిత్రం ఆడియోను ఈనెల 25న‌ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌ముఖ హీరో క‌నుపాప ఆడియోను రిలీజ్ చేయ‌నున్నారు. ఇక చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల చేయ‌నున్నారు.

Ntr guest to Mohanlal's Kanupapa audio?

ఈ ఆడియో పంక్షన్ కు ఎన్టీఆర్ ని పిలుస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కు, ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధంతో ఈ ఆడియో పంక్షన్ కు రానున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం సూపర్ హిట్టైంది. ఈ వార్త నిజమయ్యి...ఎన్టీఆర్ కనుక ఈ పంక్షన్ కు వస్తే... ఆ క్రేజే వేరు.

మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని క‌న్న‌డ‌లో శివ‌రాజ్ కుమార్, హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్ బొలుగోటి స‌మ‌ర్ప‌ణ‌లో మోహ‌న్ లాల్ నిర్మాత‌గా క‌నుపాప అనే టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌డం విశేషం.

ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే....ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అయితే....మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు అనేది ఒప్పం క‌థ‌.

సంచ‌ల‌నం సృష్టించిన‌ ఒప్పం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు కానీ...రీమేక్ రైట్స్ ఎవ‌రికీ ఇవ్వ‌కుండా తెలుగులో క‌నుపాప అనే టైటిల్ తో అనువ‌దిస్తున్నారు. మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల విజ‌యాల‌తో మోహ‌న్ లాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో క‌నుపాప‌ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో వ‌రుసగా స‌క్సెస్ సాధించిన మోహ‌న్ లాల్ క‌నుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి.

Ntr guest to Mohanlal's Kanupapa audio?

ఈ సంద‌ర్భంగా క‌నుపాప మూవీ గురించి మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.... ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ క‌నుపాప‌. ఈ చిత్రంలో నేను అంధుడిగా న‌టించాను. ఫిబ్ర‌వ‌రి 3న క‌నుపాప‌ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రాన్ని ఆద‌రించిన‌ట్టే తెలుగులో క‌నుపాప‌ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్ కుమార్ బొలుగోటి మాట్లాడుతూ...ఒప్పం చిత్రాన్ని మోహ‌న్ లాల్ గారితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించే అవ‌కాశం నాకు రావ‌డం ఆనందంగా ఉంది. మోహ‌న్ లాల్ నిర్మాత‌గా అందిస్తున్న ఈ చిత్రానికి నేను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తుండ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఈనెల 25న‌ ఆడియో రిలీజ్ చేసి ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మ‌ల‌యాళంలో కంటే పెద్ద విజ‌యాన్ని తెలుగులో సాధిస్తుంద‌నే నమ్మ‌కం ఉంది అన్నారు.

ఒప్పం కథ విషయానికి వస్తే.. ఇందులో మోహన్‌లాల్‌ అంధుడిగా నటించారు. ఆయన ఓ అపార్టుమెంట్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్టుమెంట్‌లో హత్య జరుగుతుంది. ఆ హత్య చేసిన వ్యక్తి తప్పించుకుంటాడు. అయితే.. హంతకుడ్ని మోహన్‌లాల్‌ ఎలా పట్టుకున్నాడనేది కథ.

ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి క్రేజీ ఆఫర్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ సందడి చేస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా ఒప్పం చిత్రం మళయాళంలో ఘన విజయం సాధించటం, ప్రియదర్శన్ కాంబినేషన్ కావటం, మోహన్ లాల్ నటన, సినిమా లో పాప సెంటిమెంట్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచేస్తున్నాయి. తెలుగులో ఒప్పం డబ్బింగ్ వెర్షన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

English summary
In Telugu, 'Oppam', starring Mohanlal will be a dubbed version titled 'Kanupapa'. Kanupapa's audio release function will be held on Jan 25th. The film will hit the screens on Feb 3rd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu