»   » సెంటిమెంట్ టాక్ : ‘కిక్‌-2’ ఆడియోకు ఛీప్ గెస్ట్ ఎవరు

సెంటిమెంట్ టాక్ : ‘కిక్‌-2’ ఆడియోకు ఛీప్ గెస్ట్ ఎవరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ మే 9న జరగనుందనే సంగతి తెలిసిందే. ఈ ఆడియో పంక్షన్ కు జూ.ఎన్టీఆర్ ని ఛీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గతంలో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ చిత్రం ఆడియో కు ఎన్టీఆర్..ఛీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమా ఘన విజయం సాధించి లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో మళ్లీ ఎన్టీఆర్ నే ఛీప్ గెస్ట్ గా పిలుస్తున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ఈ చిత్రం ఇన్ సైడ్ వార్తల్లోకు వెళితే..


ఈ సినిమా కు రన్ టైమ్ ప్లాబ్లం వచ్చిందని సమాచారం. 3 గంటలు పైగా సినిమా వచ్చిందని, అయితే అంత రన్ టైమ్ థియోటర్స్ లో వర్కవుట్ కావటంలేదని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చెప్తున్న నేపధ్యంలో దాని లెంగ్త్ తగ్గించాలని ఎడిటర్ గౌతమ్ రాజు కృషి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతీ సీన్...కీలకమైందిగా ఉందని దాంతో ఏ సీన్ ఎడిట్ చేసి లెంగ్త్ తీసేయాలనే సందిగ్దంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.


NTR is chief guest for Raviteja's Kick 2 audio release

ముఖ్యంగా దర్శకుడు సురేంద్రరెడ్డి..సీన్స్ కట్ చేయటానికి ఒప్పుకోవటం లేదని అంటున్నారు. రీసెంట్ గా ... నిర్మాత, దర్శకుడు మధ్య మాటల యుద్దం జరిగిందని, త్వరగా పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేయమని నిర్మాత చెప్పినట్లు సమాచారం. మే మొదటి వారం లేదా రెండవ వారంలో సినిమా రిలీజ్ చెయ్యాలంటే స్పీడు పెంచాల్సిందే అన్నారని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైన తర్వాత...రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసి ఎనౌన్స్ చేద్దాం అని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిక్సైనట్లు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకుల్ ప్రీతి సింగ్ నటిస్తోంది. వీరిద్దరి పెయిర్ తెరపై అధ్బుతంగా పండుతుందని అంటున్నారు.


ఇక ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) పుట్టిన తేది అయిన మే 28,2015 న విడుదల చేయటానికి నిర్మాత నందమూరి కళ్యాణ రామ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు.


NTR is chief guest for Raviteja's Kick 2 audio release

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. త్వరలో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ ఉంటుంది'' అని తెలిపారు.


నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు.


ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
NTR will be gracing Kick 2 audio launch as the chief guest held on May 9th, 2015.
Please Wait while comments are loading...