»   » త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మరో ప్రయోగం.. న్యూలుక్, స్పెషల్ రోల్‌..

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మరో ప్రయోగం.. న్యూలుక్, స్పెషల్ రోల్‌..

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR's new look For Trivikram Movie త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మరో ప్రయోగం.

జై లవకుశ చిత్రం ఓ వైపు విడుదల అవుతుంటే.... మరోవైపు ఎన్టీఆర్ కొత్త చిత్రంపై దృష్టి పెట్టారు. జైలవకుశ తర్వాత యంగ్ టైగర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ అంశంపై జై లవకుశ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్. త్వరలో విడుదల కాబోతున్న జై లవ కుశలో రావణ పాత్రతో ఓ ప్రయోగానికి తెరలేపాడు. తన తదుపరి చిత్రంలో నటుడిగా మారో ప్రయోగానికి శ్రీకారం చుట్టునున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సదరు చిత్రంపై వివరాల్లోకి వెళ్లితే....

త్రివిక్రమ్ కోసం..

త్రివిక్రమ్ కోసం..

త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గనున్నాడట. అలాగే లుక్ పరంగా... ఫిజిక్ పరంగా పలు మార్పులు చేయబోతున్నాడని సమాచారం. అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోబోతున్నాడు... అందుకోసం దక్షిణాసియాలోని ఓ దేశంలో దీనికి సంబంధించి శిక్షణ తీసుకోబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్ ఫెర్ఫార్మ్ చేయలేదు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కారణంగా ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. దీంతో ఆయన అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. అలాగే త్రివిక్రమ్ సినిమాలో తమ అభిమాన హీరో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడన్న ఆనందంతో వారంతా ఉబ్బితబ్బిబు అవుతున్నారు.

కథకు మంచి స్కోప్

కథకు మంచి స్కోప్

కాగా ఈ అంశంపై ఎన్టీఆర్ స్పందిస్తూ... త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేయబోతున్నానని చెప్పారు. కథకు మంచి స్కోప్ ఉందని త్రివిక్రమ్ చెప్పారు. సో... వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించి ఓ విద్యను ఎన్టీఆర్ నేర్చుకోనున్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

త్రివిక్రమ్‌తో జతకట్టి..

త్రివిక్రమ్‌తో జతకట్టి..

టాలీవుడ్‌లో ఈ తరం దర్శకుల్లో అందరితోను విభిన్నమైన చిత్రాలు చేశాడు తారక్. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా పెండింగ్ ఉంది. విలక్షణ దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలన్న అభిమానుల ఆ కోరిక కూడా వచ్చే సినిమాతో పూర్తి కానున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మారి వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఆ చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.

English summary
After Jai Lava Kusa, NTR's next movie is with Trivikram Srinivas. NTR going to be appear in new look. Tarak is under going to train martial Arts for Trivikram movie. NTRs Latest movie Jai Lava Kusa slated to release on September 21st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu