twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్-మహానాయకుడు: ఆ లాస్ కొంత పూడ్చి.. దీనికి కొత్త రేటు? షాకైన బయ్యర్లు..

    |

    Recommended Video

    NTR – Kathanayakudu Buyers Upset With Greedy Balayya | Filmibeat Telugu

    ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కగా... మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాకి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చిన్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.

    తొలి భాగం కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో 'ఎన్టీఆర్-మహానాయకుడు'లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ డేట్ కూడా ఆలస్యం అవుతోంది. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయంతో బయ్యర్లు షాకయ్యారనే వార్తలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి.

    సెకండ్ పార్ట్ బిజినెస్‌లో కవర్ చేస్తామన్నారా?

    సెకండ్ పార్ట్ బిజినెస్‌లో కవర్ చేస్తామన్నారా?

    సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపు 50% మేర నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే సినిమా అమ్మేటప్పుడే నిర్మాతలు.. ఒక వేళ ఆశించిన స్థాయిలో ఆడకపోతే సెకండ్ పార్ట్ ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్‌లో కవర్ చేస్తామని బయ్యర్లకు మాట ఇచ్చారట.

    తెరపైకి కొత్త ప్రతిపాదన, 25% పరిహారం?

    తెరపైకి కొత్త ప్రతిపాదన, 25% పరిహారం?

    మొదటి భాగం వల్ల ఏర్పడ్డ నస్టాలను రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్‌లో సెటిల్ చేయడం కాకుండా... నష్టపోయిన వారికి 25% పరిహారం ఇవ్వాలని కొత్త ప్రతి పాదన తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రానికి కొత్త రేట్లుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

    ఈ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు?

    ఈ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు?

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్.బి.కె ఫిల్మ్స్ పతాకంపై బాలయ్య నిర్మిస్తున్నారు. మరికొందరు కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. అయితే ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

    ఫిబ్రవరి 22న రిలీజ్

    ఫిబ్రవరి 22న రిలీజ్

    ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన ఘట్టం నుంచి... 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘట్టం వరకు జరిగిన కీలకమైన అంశాలను చూపించబోతున్నారు.

    English summary
    Film Nagar source said that, NTR biopic makers decided to return back 25% of the losses of NTR – Kathanayakudu to the buyers and are quoting new rates to release NTR – Mahanayakudu which is a huge shock for buyers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X