For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్: ఎన్టీఆర్‌ ,మహేష్ కార్‌వ్యాన్‌ వార్

  By Srikanya
  |
  NTR-Mahesh in caravan wars
  హైదరాబాద్ : ఎన్టీఆర్‌ కోసం ఆధునిక హంగులతో కూడిన ఓ కార్‌ వ్యాన్‌ సిద్ధమవుతోంది. రూ: ఆరున్నర కోట్లతో ఆ వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఇటీవల ఎన్టీఆర్‌ పుణె వెళ్లి రెండు రోజులపాటు దగ్గరుండి కార్‌వ్యాన్‌ పనులను పర్యవేక్షించి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తన అభిరుచికి తగ్గట్టుగా వ్యాన్‌ని సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

  సినిమా చిత్రీకరణ జరిగే చోటు తారల బస కోసం ఈ కార్‌వ్యాన్‌లు వాడుతుంటారు. అందులోనే సర్వ సౌకర్యాలు ఉంటాయి. తారలు వాడే కార్‌వ్యాన్ల గురించి పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంటుంది. మహేష్‌బాబు రూ: ఎనిమిది కోట్లతో తయారు చేయించిన కార్‌వ్యాన్‌ని వాడుతున్నారు. అందులోనే డైనింగ్‌హాల్‌, బెడ్‌ రూమ్‌, గెస్ట్‌ రూమ్‌, లివింగ్‌ హాల్‌... ఇలా అన్నీ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వీరిద్దరి కార్ వ్యాన్ గురించే అంతటా మాట్లాడుకుంటున్నారు.

  ఇక అదిరిపోయే స్టెప్పులు, ఆకట్టుకొనే సంభాషణలు, గుర్తుండిపోయే యాక్షన్‌ ఘట్టాలూ - ఎన్టీఆర్‌ సినిమా అంటే ఈజోరంతా ఉండాల్సిందే. అభిమానుల అంచనాలు అందుకొంటూనే, ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి తన స్పీడు చూపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ హీరోగా బెల్లంకొండ సురేష్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకుడు.

  సమంత, ప్రణీత హీరోయిన్స్. మంగళవారం నుంచి రాజధానిలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు ఇక్కడే షూటింగ్‌ నిర్వహిస్తారు. ఆ తరవాత జైపూర్‌లో మరో షెడ్యూలు ప్రారంభిస్తారు. ఈ సినిమాకి 'రభస' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

  ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

  English summary
  According to the sources NTR and Mahesh Babu are in costly carawan wars. Buzz is while Prince Mahesh Babu's special caravan costed Rs 8.5crs, Young Tiger's NTR caravan was specially designed for Rs 6.5 crs. NTR recently went to Pune for two days taking a break from shooting for the carawan design. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X