»   » కొత్త డౌట్: ఎన్టీఆర్ ఇదే మెయింటైన్ చేస్తాడా?

కొత్త డౌట్: ఎన్టీఆర్ ఇదే మెయింటైన్ చేస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొద్ది నెలలుగా ఎన్టీఆర్... తన తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో..' కోసం పెంచిన గెడ్డం హాట్ టాపిక్. అయితే రీసెంట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంలో పాల్గొనేందుకు ఆ గెడ్డాన్ని తీసేసి ఫ్రెష్ గా కనిపించారు. తన కొడుకు పుట్టిన దగ్గర నుంచి తనను గెడ్డంతో చూడలేదని అందుకే తీసేసానని జోక్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఇదే లుక్ తో తన తదుపరి చిత్రం జనతా గ్యారేజ్ లో కనపడతారా అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.

దానికి తోడు గెడ్డం తీసేసిన ఎన్టీఆర్ ...తన హెయిర్ స్టైల్ మాత్రం అలానే ఉంచారు. దానికి కారణం ఎంటంటే, కొరటాల శివ డైరక్షన్ లో తాను నటించబోయే జనత గ్యారేజ్ లోకూడా ఇదే లుక్ లో కనిపించనున్నారని సమాచారం.


జనతా గ్యారేజ్ కి హీరోయిన్స్ గా సమంతా, నిత్యామీనన్ లను అనుకుంటున్నారు. ప్రీ పోడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాపై అంచానలు అప్పుడే ఊపందుకున్నాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్స్ లో బిజిగా వున్నాడు. ఈ సినిమా విడుదలైన మరుక్షణం, జనతాగ్యారేజ్ లో అడుగు పెట్టనున్నాడు.


Ntr to maintain this look for Janata Garage?

ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.


ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోని కొన్ని దృశ్యాలను వ్యతిరేకిస్తూ శనివారం హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఓ సామాజిక వర్గంవారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోస్టర్లను ముద్రించారని, వెంటనే ఆ పోస్టర్లను తొలగించి సినిమాలోంచి ఆ దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు ఆ ర్యాలీ నిర్వహించింన సంగతి తెలిసిందే.

English summary
NTR will also be using this trimmed-beard look for his next movie Janata Garrag as well.
Please Wait while comments are loading...