»   »  మురుగదాస్ తో అల్లు అర్జునా ...ఎన్టీఆరా ...లేక..?

మురుగదాస్ తో అల్లు అర్జునా ...ఎన్టీఆరా ...లేక..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
'గజనీ' సినిమాతో పాపులరై చిరంజీవి 'స్టాలిన్' తో తెలుగునాట అడుగుపెట్టి అనంతరం బాలీవుడ్ వెళ్ళిన మురుగదాస్ కి సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. శంకర్ లా సామాజిక సమస్యలకు కమర్షియల్ టచ్ ఇచ్చి హీరోలను చూపటంలో అతను ఆరితేరటంతో అతని వైపై ఆసక్తిగా అందరూ చూస్తున్నారు. యంగ్ హీరోలందరికీ అతని దర్శకత్వంలో చేయాలని కోరిక ఉందనేది సత్యం. దాంతో అతను తెలుగులోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్టీఆర్ హీరోగా సినిమా ఉండవచ్చనని కొందరంటున్నారు. కాదు..అల్లు అర్జున్ ఉండవచ్చవనేది మరికొందరి టాక్. ఈలోగా మురుగుదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయవచ్చననేది తమిళ మీడియా కోడైకూస్తోంది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వరుడు,ఎస్.జె.సూర్య-పవన్ కాంబినేషన్ లో పులి నిర్మిస్తున్న ఫైనాన్సర్ శింగనమల రమేష్ ఎన్టీ ఆర్ తో ఈ ప్రాజెక్టు చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినవస్తున్నాయి. రమేష్ వద్ద ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయని అయితే ఆయన వాటిని ఇలాంటి క్రేజి కాంబినేషన్ లో వినియోగిద్దామని యేచిస్తున్నట్లు చెపుతున్నారు. తాజాగా మురుగుదాస్ ...అమీర్ ఖాన్ ని గజనీ గా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కావంటతో ఆయన తన కుమారుడు తో మురుగుదాస్ కాంబినేషన్ ప్లాన్ చేసేందుకు మాట తీసుకున్నాడని అంటున్నారు. అందుకే అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్టు ఏమిటన్నది ఫైనలైజ్ చేయలేదని ఫిల్మ్ నగర్ న్యూస్ . దాంతో మురుగుదాస్ ఎన్టీఆర్ తో చేస్తారా ...అల్లు అర్జున్ తో చేస్తారా లేక ఇద్దరినీ కాదని రజనీకాంత్ ని డైరక్ట్ చేస్తారా అన్నది త్వరలో తేలనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X