»   »  ఎన్టీఆర్ నెక్ట్స్ ఖరారు...త్రివిక్రమ్ తో కాదు

ఎన్టీఆర్ నెక్ట్స్ ఖరారు...త్రివిక్రమ్ తో కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం సుకుమార్ తో చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా అది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కాదు అని తెలుస్తోంది. మరి ఆ దర్శకుడు ఎవరూ అంటే కొరటాల శివ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ తో శ్రీమంతుడు చేయటానికి ముందే... ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అవి మెటిరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం కొరటాల శివ కథను ..ఎన్టీఆర్ ఓకే చేసినట్లు సమాచారం.

ఈ కాంబినేషన్ లో రూపొందే చిత్రం 2016 జనవరి అధికారికంగా మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే కొరటాల శివ ఓ స్టొరీ లైన్ తో ఎన్టీఆర్ ని కలిసి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేది ఎవరు,మిగతా టెక్నీషియన్స్ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సినిమాతో బిజీగా ఉంటే, కొరటాల శివ మహేష్ బాబు ‘శ్రీమంతుడు'ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ - కొరటాల శివ సినిమా మొదలుతుంది.

NTR Okayed Koratala story

ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం షూటింగ్ లేటవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు, రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపధ్యంలో చిత్రం ముహూర్తం గురించి విషయం తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు మొదలవుతుందీ, అప్పుడు మొదలవుతుందీ అన్న ప్రచారం ఎన్నోసార్లు వినిపించగా ఇప్పటికీ సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు.

కాగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జూలై మొదటి వారంలో లండన్‌లో ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఇక జూన్ 28నే సినిమా యూనిట్ లండన్‌కు పయనం కానుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..' అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ‘అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు.

దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
NTR and director Koratala Shiva combination might start in January or early 2016.
Please Wait while comments are loading...