»   » దిల్ రాజు బ్యానర్ లో మరోసారి ఎన్టీఆర్‌...డిటేల్స్

దిల్ రాజు బ్యానర్ లో మరోసారి ఎన్టీఆర్‌...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తెలుగులో స్టార్ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఆయన బ్యానర్ లో చేయటమంటే హీరోలు కళ్లు మూసుకుని డేట్స్ ఇచ్చేస్తారు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి ఆయన బ్యానర్ లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత 'రభస' చిత్రం చేస్తారు. అది పూర్తయ్యాక రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఇప్పటికే వంశీతో హీరో, నిర్మాత చర్చలు సాగించినట్లు తెలిసింది. గతంలో ..బృందావనం చిత్రాన్ని దిల్ రాజు ఎన్టీఆర్ తో నిర్మించారు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా'కి ఆయనే నిర్మాత. అలాగే వక్కంతం వంశీ చిత్రం ఓకే చేయటంతో ..దిల్ రాజు తో ఎన్టీఆర్ హాట్రిక్ కు రెడీ అవుతున్నట్లు అయ్యింది.


వక్కంతం వంశీ మాట్లాడుతూ..."దర్శకుడిగా నా తొలి చిత్రంలోనే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయబోవడం అనేది నాకు మామూలు అవకాశం కాదు. 'ఎన్టీఆర్ ఓ మంచి డైరెక్టర్‌ని పరిచయం చేశాడు' అనుకోవాలని ఆయన చెప్పాడు. తనే వ్యక్తిగతంగా నాకు అడ్వాన్స్‌నిచ్చాడు. ఎవరు చేస్తారలా!'' అని చెప్పారు వక్కంతం వంశీ. స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించిన రచయితగా పేరు తెచ్చుకున్న ఆయన త్వరలోనే దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. తొలి చిత్రంలోనే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు

English summary
NTR Jr has okayed writer Vakkantham Vamsi's directorial venture. What's interesting is that this film will also be produced by Dil Raju. Vakkantham Vamsi wrote scripts for several blockbusters including Ravi Teja starrer Kick. Vakkantham Vamsi read out his script to NTR and Dil Raju, which impressed them immediately. NTR immediately agreed. The project will be made under Sri Venkateswara Creations.
Please Wait while comments are loading...