»   » ఎన్టీఆర్ కండలు పెంచేది అందుకేనా.. రోల్ రివీల్ అయిందా!

ఎన్టీఆర్ కండలు పెంచేది అందుకేనా.. రోల్ రివీల్ అయిందా!

Subscribe to Filmibeat Telugu
నందమూరి ఫ్యాన్స్ కి అయన అంటే ఎందుకు అంత భయం?

ఈ ఏడాది రాబోతున్న చిత్రాలలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ప్రతిష్టాత్మకమైనది. తొలిసారి వీరి కలయికలో చిత్రం రాబోతోంది. కుటుంబ కథా చిత్రాలకు తన మాటల మాయాజాలాన్ని జోడించి అలరించడం త్రివిక్రమ్ శైలి. అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందినప్పటికీ త్రివిక్రమ్ పై నందమూరి అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది.

తొలిసారి ఎన్టీఆర్‌తో

తొలిసారి ఎన్టీఆర్‌తో

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో రెండు చిత్రాలు, అల్లు అర్జున్ తో రెండు చిత్రాలు మరియు పవన్ కళ్యాణ్ తో మూడు చిత్రాలు చేశారు. ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండడం ఇదే తొలిసారి.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ మాటలతోనే కట్టిపడేయగలడు. దీనితో వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఘనవిజయం ఖాయం అని ఎన్టీఆర్ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొదలు కాబోతోంది

మొదలు కాబోతోంది

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపించబోతున్నాడా

ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపించబోతున్నాడా

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ తన మేకోవర్ ని మార్చుకుంటున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ జిమ్‌లో కండలు తిరిగేలా కసరత్తులు చేస్తున్న ఫొటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ కసరత్తు త్రివిక్రమ్ కోసమే అని అంటున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్

పూజా హెగ్డే హీరోయిన్

ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజీ ఆఫర్లని అందుకుంటోంది. అందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

English summary
NTR to play army officer in Trivikram movie.shoot will starts form April
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X