»   » ఎన్టీఆర్ కు తెగ నచ్చింది,వెంటనే ఆమెను తన సినిమాలో కి

ఎన్టీఆర్ కు తెగ నచ్చింది,వెంటనే ఆమెను తన సినిమాలో కి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని తాజా చిత్రం జంటిల్ మెన్ లో ఎక్కువ మార్కులు కొట్టేసింది ఎవరూ అంటే నిశ్సందేహంగా నివేదితా ధామస్ అని చెప్పవచ్చు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఆమె నటనకు మాత్రం ప్రసంశలు వర్షం కురుస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెకు ఆఫర్స్ కూడా కంటిన్యూగా వస్తున్నాయి. అంతేకాదు పెద్ద హీరోలు సైతం తమ సినిమాల్లో ఆమెను తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..జూ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం లో హీరోయిన్ గా నివేదితను తీసుకోవాలని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ మేరకు వక్కంతం వంశీ ఆమెను కలిసి కథ వినిపించినట్లుగా చెప్పుకుంటున్నారు.

NTR recommend Niveda Thomas for Vamsi's Flick

ఫెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ పాత్ర అదని, ఎవరైతే బాగుంటుంది అని వెతుకుతున్నప్పుడు నివేదిత పేరు వినిపించటంతో వెంటనే ఎన్టీఆర్ స్టెప్ తీసుకుని ఆమెను ఎప్రోచ్ అవమని సూచించాడని అంటున్నారు. బిజీ అయిన తర్వాత మళ్లీ తమ సినిమా టైమ్ కు డేట్స్ దొరకకపోతే ఇబ్బంది అవుతుందని ఇలా వెంటనే డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం 'జనతాగ్యారెజ్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఆ పనులు వేగవంతమయ్యాయి. రచయిత వక్కంతం వంశీతో సినిమా తో అనుకున్న ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాలుగా పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు సెట్ అయింది.

రచయితగా ఉన్న వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఎమోషన్ తో కూడిన పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారెజ్' చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నారు.

English summary
Ntr recommended the name of 'Gentleman' beauty Niveda Thomas. As one of two Heroines in his 27th Project under Vakkantham Vamsi's direction. Kalyan Ram himself would produce this venture on NTR Arts Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu