»   » బోయపాటి శ్రీను స్కీమ్ ని దెబ్బ కొట్టిన ఎన్టీఆర్

బోయపాటి శ్రీను స్కీమ్ ని దెబ్బ కొట్టిన ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోయపాటి శ్రీను మళ్ళీ సూప్ లో పడ్డాడు. సింహా విజయంతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన బోయపాటి కి వెంటనే ఎన్టీఆర్ నుంచి ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి బోయపాటి చెప్పిన కథ ఎక్కలేదని వినపడుతోంది. కంగారు..కంగారుగా బోయపాటి వంటిన వన్ లైన్ ఆర్డర్ ని నిర్విర్ధంగా ఎన్టీఆర్ తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా తన దగ్గర ఇంతకుముందు సినిమాలు చేసేటప్పుడు కూడా ఎప్పుడు కథ గా చెప్పుకునేందుకు ఏమీ లేదని, కొన్ని హైలెట్ సీన్స్, సెటెప్ సీన్స్ తో తను రాసుకునే స్క్రీన్ ప్లేనే భద్ర, సింహా, తులసి చిత్రాలను ఆడించిందని అదే పంధాలో తాను రాసినదే ఎన్టీఆర్ కి చెప్పానని బోయపాటి భాధపడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఎన్టీఆర్ ని వదులుకునే స్ధితిలో లేని తాను ఎట్టి పరిస్ధితిల్లో కథతో త్వరలోనే కలుస్తానని మాట ఇచ్చాడుట. అయితే ఇంతకు ముందు సింహా ప్రారంభానికి ముందు గోపీచంద్, ప్రభాస్ ల కోసమని చాలా కాలం రైటర్స్ తో చర్చించి కథలు రెడీ చేసాడు. అయితే బాలకృష్ణ సీన్ లోకి వచ్చాక అవి వర్కవుట్ అయ్యాయి. అయితే ఇద్దరు రచయితలు అవి తమ కథలే అని సింహా రిలీజుకు ముందు ఆధారాలు చూపిస్తే బోయపాటి సైలెంట్ గా డబ్బు ఇచ్చి సెటిల్ చేసాడు. ఇప్పుడు కూడా అదే స్కీమ్ ఫాలో చేస్తాడని కొందరంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు నిర్మిస్తారు. ఆయన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం తర్వాత నిర్మిస్తున్న చిత్రం ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu