For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానాపై ఎన్టీఆర్ ప్రతీకారం సక్సెస్ !?

  By Srikanya
  |

  ఎన్టీఆర్, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన శక్తి చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కి కూడా రాకుండా ఇలియానా నిర్మాతకు ట్విస్ట్ ఇచ్చింది. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న ఎన్టీఆర్ ఆమెకు సినిమాలు లేకుండా చేసాడని ఫిల్మ్ నగర్ లో వినిపించింది. కొందరు అది నిజం కాదని కొట్టి పారేసినా ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవటం అది నిర్దారణ చేసినట్లు అయింది. ఈ దసరాకు ఊసరవెల్లి విడుదల అవుతున్న సమయంలో అంతా శక్తి సినిమాని,ఇలియానాని గుర్తు చేసుకుంటున్నారు. ఇక శక్తి విడుదల అయ్యాక ఇలియానా ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో తాను శక్తి చిత్రం చూసి చాలా నిరాశ చెందానని, తనకో కథ చెప్పి తెరపై మరొకటి చిత్రీకరించారని విమర్శిస్తూ మాట్లాడింది. అంతేగాక తన ప్యాన్స్ ని ఆ చిత్రం చూడమని చెప్పలేనని నిర్మొహమాటంగా చెప్పింది.

  అంతేగాక తాను ఈ ప్లాప్ చిత్రం ప్రమోషన్ లో పాల్గొనని తేల్చేసింది. ఇక అదే రోజున అశ్వనీదత్ గ్రాండ్ గా ఈ చిత్రానికి సంభందించి ప్రకటనలు గుప్పించారు. తమ చిత్రం విపరీతమైన కలెక్షన్స్ వసూలు చేస్తోందని, కొత్త రికార్డులు క్రియోట్ చేస్తోందని అన్నారు. దాంతో అదే రోజు ఇలియానా ఇంటర్వూ చూసిన వారికి అవన్నీ దొంగ లెక్కలని, కావాలని సినిమాని హైప్ చేస్తున్నారని అర్దమయింది. దాంతో ఇంకా కొద్దో గొప్పో వెళ్ధామనుకున్నవారు కూడా ఆగిపోయే సిట్యువేషన్ వచ్చింది. ఇది నిర్మాతగా అశ్వనీదత్ కీ, హీరోగా ఎన్టీఆర్ కి మింగుడు పడని విషయం. కోటి రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని ఇలా భాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం వారికి నచ్చలేదు. దాంతో మండి పడుతున్న ఎన్టీఆర్ తన తోటి పెద్ద హీరోలతో చర్చించి ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టి ఆమెకు బుద్ది చెప్పారని అప్పట్లో వినిపించింది.

  ఇక ఇలియానా మాత్రం ఫ్లాప్‌లు నన్నేం చేయలేవు. ఒకవేళ అవి ఎదురైతే... వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. రెండుమూడు ఫ్లాపులకే కరిగిపోయే ఇమేజ్ కాదు నాది.కిక్ కి ముందు ఇలియానా పనైపోయిందని చాలామంది అన్నారు.తర్వాత ఏమైందో మీకు తెలుసు అంటూ ఛాలెంజ్ లు విసిరింది. అయితే అవేమీ ఫలించలేదు. ఆమెకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న త్రీ ఇడియట్స్ షూటింగ్ లో జరిగింది. ఇందులో ఓ ప్రత్యేకమైన పాటను ప్లాన్ చేసారు. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్‌లో శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. అలాగే ముగ్గురు హీరోలూ చాలా ఫ్రెండ్లీగా మెలిగారు. హిందీ 3 ఇడియట్స్ చూశాను. నా నటనలో కరీనా ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కరీనా చేసినట్లుగానే నేను కూడా యాక్ట్ చేస్తే ఇక సినిమా చేయడమెందుకు, 3 ఇడియట్స్ చూస్తే కరీనా శైలి కనిపిస్తుంది.నన్బన్ నా టైప్‌లో ఉంటుంది అని చెప్పింది.

  English summary
  Ileana, who was not so happy with the way Ashwini Dutt treated her for Shakti, stated that it was a bad film and she regretted doing it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X