»   »  "నాన్నకు ప్రేమతో" లో మిస్సైంది ఇదే

"నాన్నకు ప్రేమతో" లో మిస్సైంది ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ని హాలివుడ్ నటుడు స్థాయిలో చూపించబోతున్న సినిమా "నాన్నకు ప్రేమతో". రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంతా సుకుమార్ స్టైలిష్ మేకింగ్ తో సాగిపోయింది. ఈ సినిమా నాన్నకు సంబందించినదని టైటిల్ లోనే తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కాకపోతే ఈ సినిమా లో మెత్తం ఐదు పాటలైతే అందులో ఒకటి నాన్నకు సంబందించిన సెంటిమెంట్ సాంగ్. ఈ ట్రాక్స్ లో ఆ పాట మిస్సయిందని సమాచారం.


ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందిచిన పాటలు వరుసగా ఫాలో ఫాలో, లవ్ దెబ్బ, నా మనసు నీలో మరియు లవ్ మి యగైన్ అనే నాలుగు పాటలు రోమాంటిక్ అయితే. డోన్ట్ స్టాప్ అనే ఈ ఐదో పాట ఆల్బమ్ లో ఖచ్చితంగా ఉండాల్సిదే. కాని అందులో మిస్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియాల్సి వుంది.


NTR's Nannaku prematho one song missed

సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 13న వస్తున్న ఈ సినిమా ఎ మేరకు విజయం సాదిస్తుందో చూడాలి. సుకుమార్ తన మార్కు చూపిస్తాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. బాబయ్ తో పోటి పడుతున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా రిలిజ్ పెద్ద సవాలే.


''సుకుమార్ కథ రాయడు. జీవితాన్ని రాస్తాడు. సుక్కు నాన్నగారి కొన ఊపిరి నుంచి పుట్టిన కథ ఇది'' అని ఎన్టీఆర్ అన్నారు. ‘‘నేను నటించిన 25వ చిత్రమిది. ఇన్ని చిత్రాలు కాదు కదా అసలు నేను నటుడిని అవుతానని కూడా అనుకోలేదు. నీ వెన్నంటి నేనున్నానని నాకు ధైర్యం చెప్పి పరిశ్రమకి పంపించింది మా నాన్నగారే. ఈ సినిమా తల్లిదండ్రులకి నీరాజనం'' అన్నారు ఎన్టీఆర్‌.


ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో..' ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ మిలియన్‌ హిట్స్‌ దాటి దూసుకుపోతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

English summary
In the whole "Nannaku Prematho" album, 'Don't Stop' song is missed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu