»   » 'నాన్నకు ప్రేమతో' కథ ఇదేనా?

'నాన్నకు ప్రేమతో' కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ నటించి సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం కథ గురించి పరిశ్రమలో రకరకాల కథనాలు వినపడుతున్నాయి. వాటిలో ఒకటి మీకు అందిస్తున్నాం. అందుతున్న సమాచారం ప్రకారం...ఇది ముప్పై రోజుల్లో జరిగే కథ. బ్రిటన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. తండ్రి,కొడుకుల ఎమోషన్ నుంచి రివేంజ్ వైపు ప్రయాణించే కథ ఇది.

కథలో అభిరామ్ (ఎన్టీఆర్) ... లండన్ బేసెడ్ ఎన్నారై. స్పెయిన్ లో ఉంటున్న అతనికి ఇండియా నుంచి కాల్ వస్తుంది. అతని తండ్రి(రాజేంద్రప్రసాద్) హాస్పటిల్ లో ఎడ్మిట్ అయ్యాడని ఆ కాల్ సారాంశం. షాక్ అయిన అభిరామ్ కి తన తండ్రి చివరి క్షణాల్లో ఉన్నాడని తెలుస్తోంది.


Ntr's Nannaku Prematho Story line

తండ్రిని కలిసిన అతనికి తండ్రి గురించిన ఓ నిజం తెలుస్తుంది.. తన తండ్రి తన క్లోజ్ ఫ్రెండ్ కృష్ణమూర్తి (జగపతిబాబు) చేతిలో మోసపోయాడని తెలుస్తుంది. తన తండ్రిని మోసం చేసిన కృష్ణమూర్తి ని తన తండ్రి బ్రతికుండగానే రోడ్డుమీదకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అందుకు కేవలం ఓ నెల మాత్రమే తన తండ్రి బ్రతికే అవకాసం ఉందని తెలుస్తుంది.


అక్కడ నుంచి అభిరామ్ తన యాక్షన్ ప్లాన్ ని మొదలెడతాడు. మొదటిగా... లండన్ కు కృష్ణమూర్తిని వెతకటానికి వెళ్లి అక్కడ దేవిక(రకుల్) ని ట్రాప్ లో పడేసి ప్రేమలో పడేస్తాడు. దివ్యాంక మరెవరో కాదు...కృష్ణమూర్తి కుమార్తె.


ఫస్టాఫ్ చివర్లో కృష్ణమూర్తి కి ...అభిరామ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. అంతేకాకుండా అభిరామ్..అతన్ని...నీ సామ్రాజ్యం పూర్తిగా కోలుదోసి నిన్ను రోడ్డులపై లాగుతానని ఛాలెంజ్ చేస్తాడు. అక్కడ నుంచి అతని సంస్దలపై యుద్దం ప్రకటించిన స్దాయిలో మైండ్ గేమ్ ఆడుతూ వాటిని నాశనం చేసి గెలుస్తాడు.


Ntr's Nannaku Prematho Story line

సినిమా చివర్లో...అభిరామ్ తండ్రి...ఆఖరి శ్వాస పీలుస్తూ... కృష్ణమూర్తిని రోడ్డుపై పడటాన్ని టీవిల్లో చూస్తూంటాడు. అలా అభిరామ్ .. తన తండ్రి నుంచి మోసం చేసి లాక్కున్న ఆస్ది మొత్తాన్ని తన తెలివితేటలతో విలన్ జగపతిబాబు నుంచి కక్కిస్తాడు. అందుకోసం ఎన్నో మైండ్ గేమ్స్ ఆడతాడు. తన తండ్రి కోసం ఎంతకైనా తెగిస్తాడు.


రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ ..అభిరామ్ సోదరులుగా..సితార అభిరామ్ తల్లిగా కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ..అభిరామ్ కు సోదరడుగా...తాగుబోతు రమేష్ అభిరామ్ అసెస్టెంట్ గా నవ్విస్తాడు.


ఫస్టాఫ్ సినిమా ఓకే అనిపిస్తూ రెగ్యులర్ లవ్ స్టోరీతో ఓకే అనిపించినా సెకండాఫ్ చివర్లో వచ్చే నలభై నిముషాలు హార్ట్ టచింగ్ సెంటిమెంట్స్, ఎమోషన్స్ తో సాగుతుంది. ఎన్టీఆర్ టెర్రిఫిక్ యాక్షన్ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.


ఈ కథ గతంలో జగపతిబాబు తో వచ్చిన అతడే ఓ సైన్యం నుంచి గుర్తు చేస్తుంది అంటున్నారు. అలాగే జెఫ్రీ ఆర్చర్...నాటే పెన్నీ లెస్...నాటే పెన్నీ మోర్ ని కూడా గుర్తు చేయవచ్చు అంటున్నారు. అయితే ఏది ఎలా ఉన్నా సినిమా మాత్రం అద్బుతంగా వచ్చిందని ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇచ్చిన చిత్రం అంటున్నారు.

English summary
Nannaku Prematho is an action family drama, which is laced with lot of human emotions. Written by Sukumar, the film has a simple and revenge story.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu