»   » సాఫ్ట్ వేర్ పీపుల్ ... ఎన్టీఆర్ నే ఫాలో

సాఫ్ట్ వేర్ పీపుల్ ... ఎన్టీఆర్ నే ఫాలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ లేటేస్ట్ సినిమా నాన్నకు ప్రేమతో టీజర్ లో 'ఐ వాన టు ఫాలో ఫాలో ఫాలో యు' అంటూ సాగిపోయి అదిరిపోయిన సంగతి తెలిసిందే. ఆ సెల్ఫ్ బ్యాలన్సింగ్ టు - వీలర్ ఎలక్ట్రానిక్ సెగ్వే స్కూటర్ ఇప్పుడు హైదరాబాద్ ఐటీ ఫ్రొఫెషనల్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఈ సెల్ఫ్ బ్యాలన్సింగ్ టూ - వీలర్ ఎలక్ట్రానిక్ సెగ్వే స్కూటర్ ధర 34000. ఇది బ్లూటూత్ సహయంతో పనిచేస్తుంది. అలో మెటల్, ఫిక్సడ్ లైట్ ఫర్ నైటైమ్ దీని మరొక గొప్పదనం. సుమారు 12 నుండి 20 కె.మ్.పి.హెచ్. నడిపేవారి బరువును బట్టి, దీనిని 15°-30° మద్య బ్యాలన్స్ చేయాల్సి వుంటుంది. ఇందు లో ఎన్టీఆర్ కనిపించిన తీరుతో అభిమానులు చాలా హుషారుగా ఉన్నారు.


ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 20 న లేదా 23న గాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా యుకె లో 90 రోజుల పాటు కంటిన్యూ గా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ చిత్రంన్ని సంక్రాంతికు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


 NTR's stylish ride on two wheeler

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.


నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ,'విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్‌ చేశాం. లండన్‌లో 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
NTR's style as Spider Designs has come up with a brand new Bluetooth enabled self balancing skateboard.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu