For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ 'టెంపర్‌' ఆడియో లాంచ్ వెన్యూ ఛేంజ్...కారణం

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాజల్‌ హీరోయిన్. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. మొదట ఈ ఆడియోని గుంటూరులో కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో లాంచ్ చేద్దామనుకున్నా...ఇప్పుడు దాన్ని నిమ్మకూరుకు మార్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమచారం ఏమీ లేదు. గంతోల వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రా వాలా చిత్రం గుంటూరులోనే ఆడియో జరుపుకోవటం, అది ఫెయిల్యూర్ అవటం జరగటం ఇప్పుడు వెన్యూ మార్చినట్లు చెప్పుకుంటున్నారు.

  ఇక ఈ సినిమాకి 'టెంపర్‌' అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినా చిత్రబృందం 'టెంపర్‌'పైనే మొగ్గు చూపినట్టు సమాచారం. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారు. ''ఎన్టీఆర్‌ పూర్తిస్థాయిలో పోలీసుగా నటిస్తున్న చిత్రమిది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందుతోంది. ఎన్టీఆర్‌ చేసే సందడి ఆకట్టుకుంటుంది'' అని నిర్మాత తెలిపారు.

  చిత్రం విశేషాలలోకి వెళ్తే...

  పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్, వైజాగ్‌తో పాటు విదేశాల్లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెల వరకు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  NTR’s Temper audio launch in Nimmakuru

  పూరి జగన్నాథ్ అంటే స్పీడు కు మారు పేరు. ఆయన స్క్రిప్టుని స్పీడుగా రాయటమే కాదు..అంతకన్నా వేగంగా తెరకు ఎక్కించగలరని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. అందుకే హీరోలంతా ఆయన డైరక్షన్ లో చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. హిట్టో,ఫట్టో నాలుగైదు నెలల్లో తేల్చేయటం ఆయన స్పెషాలటి. అలాగని ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవటమనేది జరగదు. తెరపై ఏ ఫ్రేమ్ ఎలా వస్తుందో, ఏ షాటో అవసరమో పూర్తి క్లారిటీతో ఉండటమే ఆయన స్పీడు సీక్రెట్ అని చెప్తూంటారు. తాజాగా చేస్తున్న ఎన్టీఆర్ సినిమాతో అది మరోసారి పూరి ప్రూవ్ చేస్తున్నారు.

  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్టాఫ్ అప్పుడే పూర్తైందని సమాచారం. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా పూర్తి ఏర్పాట్లు చేసాడని, పూరి స్పెషల్ గా ఎన్టీఆర్ ని స్టైలిష్ గా డిజైన్ చేసాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే బిజినెస్ క్రేజ్ తెచ్చి పూర్తి చేద్దామనే ధీమాలో దర్శక,నిర్మాతలు ఉన్నారు. ఈ వారం చివరలో ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండబోతోందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని పూరి తీర్చి దిద్దుతున్నారు.

  షూటింగ్ ను అత్యంత వేగంగా పూర్తి చేయగల దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన సినిమా అంటే యూనిట్‌ మొత్తం చాలా స్పీడుగా ఉండాలి. ప్రస్తుతం ఎన్టీఆర్‌-పూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఓ చిత్రం మరింత వేగంగా చిత్రీకరణ జరుగుతోందని యూనిట్‌ అంటోంది. ప్రస్తుతం యూనిట్‌ అంతా గోవా షూటింగ్ లో తలమునకలై ఉంది. ఇందులో ఎన్టీఆర్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఓ పాటతో సహా పోరట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

  ఇటీవల ఉత్తరాంధ్రాలో సంబవించిన తుఫాన్‌ కారణంగా వైజాగ్‌ షెడ్యూల్‌ను సైతం గోవాలోనే షూట్‌ చేయనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికే పలుకారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమవ్వడంతో ఆన్‌ సెట్స్‌లోనే పూరీ ఎస్‌. ఆర్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో ఎడిటింగ్‌ పనులు కూడా చేయిస్తున్నారని యూనిట్‌ అంటోంది.

  ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె.నాయుడు, సంగీతం: అనూప్‌రూబెన్స్, నేపథ్య సంగీతం:మణిశర్మ, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్.

  English summary
  NTR and Puri Jagannadh’s upcoming movie ‘Temper’audio launch is planned on 14th December at Kasu Brahmananda Reddy Stadium in Guntur. But now the filmmakers have decided to launch the audio of the film in Nimmakuru.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X