»   »  ‘దోచేయ్’ దారణ ఫ్లాఫ్...ఎన్టీఆర్ సినిమాకి దెబ్బ

‘దోచేయ్’ దారణ ఫ్లాఫ్...ఎన్టీఆర్ సినిమాకి దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ ఫెయిల్యూర్ తర్వత వచ్చే చిత్రాల నిర్మాణాలపై ఖచ్చితంగా పడుతుంది. ఫైనాన్స్ సమస్యలు వచ్చిపడతాయి. తాజాగ అలాంటి చేదు అనుభవమే నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ కు ఎదురౌతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆయన రీసెంట్ గా నాగచైతన్య హీరోగా కృతి సనన్‌ హీరోయిన్‌గా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘దోచేయ్‌' నిర్మించారు .

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగచైతన్య కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది అని భావించి విడుదల చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఫ్రభావం తదుపరి చిత్రం ఎన్టీఆర్,సుకమార్ కాంబినేషన్ పై పడిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఇంకా మొదలు కాలేదు. కారణం ఏమిటీ? అంటే డబ్బుల సమస్యే అని అంటున్నారు.

సుకుమార్ మరియు సంగీత దర్శకుడు దేవి తన బృందంతో కలిసి స్పెయిన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళి వచ్చారు. ఈ సినిమాకి ట్యూస్స్ సమకూర్చే పనిలో ఏప్రిల్ 9వరకూ అక్కడే గడపారు. ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

 NTR-Sukumar film facing hiccups

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అఫీషియల్ లాంచింగ్ ని యుకే లో చేస్తున్నట్లు సమాచారం. అక్కడ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతాం కాబట్టి అక్కడే లాంచింగ్ పెట్టుకుంటే మంచిదని ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు.

దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
BVSN Prasad is not in best pace financially and his recent film ‘Dochey’ is a big dud near box-office. His failures are hunting him and preventing him to get all his finances in place in time for his upcoming film with NTR.
Please Wait while comments are loading...