»   » పక్కా మాస్ టైటిల్ తో ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి చిత్రం

పక్కా మాస్ టైటిల్ తో ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం చిత్రానికి అతడే ఆమె సైన్యం, ఊసరివిల్లి అనే టైటిల్స్ లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి రచ్చ అనే పెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ ని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. బృందావనం చిత్రంలోని పాపులర్ డైలాగ్ లోని రచ్చ రచ్చే అనే దాని ప్రేరణతో ఈ టైటిల్ ని పెట్టాలని ఎన్టీఆర్ ఫిక్సయినట్లు చెప్తున్నారు. ఇక నిజానికి ఊసరవిల్లి టైటిల్..మొదట రామ్, జెనీలియా కాంబినేషన్ అనుకున్నప్పుడు అనుకున్నది. ఆ తర్వాత రాణాకీ ఆ టైటిలే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గరకి వచ్చేసరికి అదే స్క్రిప్టుకి అతడే ఆమె సైన్యం అని పెడదామని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మరో ప్రక్క ఎన్టీఆర్...శక్తి చిత్రం షూటింగ్ లలో బిజీగా పాల్గొంటున్నారు. ఈ కొత్త చిత్రం నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తమన్నా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని బివిఎస్ యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక మొదట ఈ చిత్రానికి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ఫిక్సయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu