బాలయ్య వస్తున్నాడని, ఎన్టీఆర్ వెనకడగు

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య టెర్మ్స్ సరిగ్గా లేవని చాలా కాలంగా మీడియాలో నడుస్తున్నదే. కారణం ఏమిటన్నది తెలియదు కానీ ఈ టాక్ మాత్రం చాలా కాలంగా ఉన్నదే. ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి బాలకృష్ణతో కలవాలని ప్రయత్నించినా ...ఆయన పెద్దగా ఆసక్తి చూపటంలేదని చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్, బాలకృష్ణ చిత్రాలు రెండూ సంక్రాంతికే ప్లాన్ చేసారు. దాంతో ఎన్టీఆర్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

బాలకృష్ణ తాజా చిత్రం 'డిక్టేటర్‌' జనవరి 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సంక్రాతికి రావాల్సిన ఎన్టీఆర్ తన చిత్రం 'నాన్నకు ప్రేమతో' ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. తన బాబాయ్ చిత్రం వస్తున్నప్పుడు తను పోటీకి రావటం ఎందుకనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ వెనకడుగు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏదీ లేదు.

NTR To Take A Back Step For Balakrishna

బాలకృష్ణ చిత్రం విశేషాలకు వస్తే...

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్ . శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో రవివర్మ నేతృత్వంలో ఫైట్ సీన్స్ తెరకెక్కించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గురువారం నుంచి హైదరాబాద్‌లో మరో దఫా షూటింగ్ మొదలెడతారు. ఈ నెల 23న 'డిక్టేటర్‌' యూనిట్ డిల్లీ వెళ్లనుంది. అక్కడ వారం రోజుల పాటు జరిగే షూటింగ్‌తో టాకీ పూర్తవుతుంది. వచ్చే నెల చివరి వారంలో పాటల్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రమిది.

తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, రచన: కోనవెంకట్‌ - గోపీమోహన్‌, రచనా సహకారం: శ్రీధర్‌ సీపాన

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X