»   » ఎన్టీఆర్ తో ‘కత్తి’ రీమేక్...డైరక్టర్ ఎవరంటే

ఎన్టీఆర్ తో ‘కత్తి’ రీమేక్...డైరక్టర్ ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విజయ్,సమంత కాంబినేషన్ లో మురుగదాస్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం కత్తి. ఈ చిత్రం తెలుగు హక్కులను ఠాగూర్ మధు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డబ్ చేద్దామా లేక తెలుగులో రీమేక్ చేద్దామా అనే డైలమో చాలా కాలం కొనసాగింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం రీమేక్ కు జూ.ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు కలిసి బుజ్జి బ్యానర్ పై రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సుకుమార్ చిత్రం పట్టాలు ఎక్కిన తర్వాత ప్రారంభం అవనుంది.సుకుమార్ చిత్రం , ఈ చిత్రం ఒకే సారి చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడుగా గోపిచంద్ మలినేని ఎంపిక చేసుకున్నట్లు తెసుస్తోంది. డాన్ శీను చిత్రంతో పరిచయమైన గోపీచంద్ మలినేని తర్వాత బలుపుతో హిట్ కొట్టారు. ఇప్పుడు రామ్ హీరోగా పండుగ చేస్కో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం...స్క్రిప్టుపై కూర్చోనున్నారని తెలుస్తోంది.

NTR in Tamil Katti movie re-make

మొదట పవన్ తో ఈ రీమేక్ అనుకున్నారు. అయితే ఆయన ఆసక్తి చూపకపోవడంతో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. తాజాగా విడుదల సందిగ్దంలో పడింది. ఎన్టీఆర్ తో రీమేక్ చేయడానికి మధు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తమిళంలో సుమారు 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ఇంకా తెలుగులో విడుదల చేయలేదు.

ఇళయ దళపతి విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కత్తి'. దీపావళి కానుకగా తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధిచింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను, కార్పొరేట్ కంపెనీల ఆగడాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు.

‘కత్తి' లో... రైతుల కోసం పోరాడే పవర్‍ఫుల్ పాత్రలో విజయ్ అలరించారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఇప్పుడు విడుదలవుతుందని, అప్పుడు విడుదల అవుతుందని అనడమే కానీ ఇంతవరకూ ముందుకు కదల్లేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కత్తిని తెలుగులో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉండటమే లేటుకు కారణమని తెలుస్తోంది.

English summary
Tagore Madhu who bagged the re-make rights of this film has convinced NTR to star in the film. Buzz is Gopichand Malineni will be directing the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu