»   » షాక్ : కన్నడంలో పాట పాడుతున్న ఎన్టీఆర్

షాక్ : కన్నడంలో పాట పాడుతున్న ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ నటుడు మాత్రమే కాదు మంచి సింగర్ అనే సంగతి తెలిసిందే. గతంలో యమదొంగ, అదుర్స్, రభస చిత్రాలలో పాడిన ఎన్టీఆర్ తాజాగా నాన్నకు ప్రేమతో చిత్రంలోనూ తన గొంతను సవరించుకుంటున్నారు. అయితే తెలుగులో మాత్రమే కాదు ఇప్పుడు ఆయన కన్నడంలోనూ పాట పాడబోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ సన్నిహితుడైన ఎన్.కె. లోహిత్...నిర్మాతగా మారుతూ కన్నడంలో చక్రవ్యూహ అనే చిత్రం నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజకుమార్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ ఆడియన్స్ కు సర్ఫ్రైజ్ ఇవ్వటానికి ఎన్టీఆర్ చేత ఓ పాటను పాడించి, పునీత్ మీద చిత్రీకరించనున్నారు. ఆ పాట సినిమా హైలెట్ లలో ఒకటిగా నిలుస్తుందని టాక్. ఇలా వేరే లాంగ్వేజ్ సినిమాకు ఎన్టీఆర్ పాడటం ఇదే తొలిసారి.

NTR to sing a song in Kannada language?

ఎన్టీఆర్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. సంక్రాంతికు విడుదల అవుతున్న ఈ చిత్రంకు సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ వేగం అందుకుంది.

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
NTR is soon going to sing a song for a Kannada Film called Chakravyuha in which Kannada Super star Puneeth Raj Kumar plays the lead.
Please Wait while comments are loading...