»   » మొత్తానికి ఎన్టీఆర్ ఓకే అన్నాడు,ఏం చేస్తాడో?

మొత్తానికి ఎన్టీఆర్ ఓకే అన్నాడు,ఏం చేస్తాడో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చాలా కాలంగా వక్కంతం వంశీ దర్శకుడుగా లాంచ్ అవటానికి ఎదురుచూపులు చూస్తున్నాడు. అదీ వేరే హీరోతో ముందుకు వెళ్లాలనుకుంటే కోరిక తీరిపోయేదేమో. ఆయన బిజీగా ఉన్న ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలనుకున్నాడు. ఎన్టీఆర్ కూడా మాట ఇవ్వటంతో వెయిటింగ్ లోనే చాలా కాలం గడిపాడు.

అంతేకాదు చాలా సార్లు మీడియా ముందు తన తొలి చిత్రం ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయబోతున్నానని, కథ రెడీ అవుతోందని చెప్పాడు. అయితే ఇంతకాలం అందుకు సమయం రాలేదు. రీసెంట్ గా వక్కంతం వంశీ కి ఎన్టీఆర్ ..స్క్రిప్టు ని లాక్ చేసుకోమని చెప్పారని సమాచారం.

సెప్టెంబర్ నుంచి సినిమా మొదలు పెడదామని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్ట్రార్ట్ చేసుకోమని పురమాయించినట్లు సమాచారం. దాంతో జూన్ నుంచి వక్కంతం వంశీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి, ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.

NTR-Vakkantham Vamsi film from September

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పూర్తి స్దాయి...యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఊహించని ట్విస్ట్ లతో సాగే విభిన్నమైన కథనంతో వక్కంతం తన తొలి చిత్రం కథను రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్...తన తాజా చిత్రం జనతా గ్యారేజ్ బిజీలో ఉన్నారు. ఆగస్టు 12 న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ ప్లానింగ్ మేరకు కొరటాల శివ శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నారు.

English summary
For a long time now, Ntr gave green signal to writer Vakkantham Vamsi has wanted to his director. Pre-production work for the film will begin in June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu