»   » జూ ఎన్టీఆర్ పెళ్ళి ని ధియోటర్లలో పెద్ద తెరపై చూడచ్చు

జూ ఎన్టీఆర్ పెళ్ళి ని ధియోటర్లలో పెద్ద తెరపై చూడచ్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధియోటర్స్ లో చూడెచ్చు అనగానే వివాహాన్ని లైవ్ గా ధియోటర్స్ స్క్రీన్స్ పై క్రికెట్ లాగా చూడెచ్చు అనుకోకుండి. జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి లో త్వరలో జరగనున్న ఎన్టీఆర్ వివాహంలోని హైలెట్స్ ను కలపనున్నారని సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్ తో అశ్వనీదత్ చర్చిస్తున్నాడని, ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ పెళ్ళిని మా టీవి వారు లైవ్ ఇవ్వటంతో అంతకన్నా క్రేజ్ వచ్చే విధంగా తన పెళ్ళిని ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా తన లేటెస్ట్ శక్తి చిత్రానికి ఎలాగయినా కొత్త క్రేజ్ తెచ్చి మరింత కలెక్షన్స్ సంపాదించాలని అనుకుంటున్నాడు. అందులోనూ శక్తి చిత్రం బడ్జెట్ లో అత్యధిక మొత్తంలో తయారవటంతో ఏమైనా చేసి మంచి రేటు కు అమ్మాలని అశ్వనీదత్ భావిస్తున్నారు.

వీరందరి ఆలోచనలే ఈ పెళ్ళిని ధియోటర్స్ లో చూపాలనేది ఊతం ఇస్తోంది. ఇక ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అంటున్నారు. ఇదే గనుక జరిగితే శక్తి చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సోషియో పాంఠసి చిత్రంగా శక్తి పీఠాల నేఫధ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. అలాగే 'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.

English summary
The scenes of NTR's wedding are going to be added in the film ‘Shakti' at the end.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu