»   »  జూ ఎన్టీఆర్ బాలీవుడ్ బాట, కానీ అలా కాదట!

జూ ఎన్టీఆర్ బాలీవుడ్ బాట, కానీ అలా కాదట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడట. అయితే హీరోగా కాదు...సింగ‌ర్‌గా అడుగుపెడుతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోష‌న్ కోసం ఎన్టీఆర్ పాట పాడుతున్నాడు. హృతిక్ రూపొందించే పాప్ ఆల్బ‌మ్ కోసం ఎన్టీఆర్ పాటపాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం విశాల్‌-శేఖ‌ర్ నేతృత్వంలో ఈ పాప్ ఆల్బ‌మ్ రూపొంద‌బోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే తన ఆల్బంలో ఎన్టీఆర్ తో పాట పాడాలని అడిగాడట. ఇందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

NTR will be singing a song for a Hrithik?

ఆల్రెడీ తన హిందీ డబ్బింగ్ సినిమాలతో ఎన్టీఆర్ బాలీవుడ్ జనాలకు సుపరిచితమే. ఇటీవ‌లే శాండిల్‌వుడ్ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కోసం క‌న్నడ‌లో ఎన్టీఆర్ పాడిన పాట సూప‌ర్ హిట్ట‌యిన సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్లో ఎన్టీఆర్ సాంగ్ పాడుతున్న విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' మూవీ చేస్తున్నాడు. మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. రెండు సినిమాల్లోనూ హీరోలను డిఫరెంట్ స్టైల్‌లో చూపించారు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను ఓ రేంజిలో చూపిస్తారని అంచనా వేస్తున్నారు అభిమానులు.

English summary
From the last couple of days, there were rumours that Young Tiger NTR will be singing a song for a Hrithik Roshan film and that would mark his Bollywood singing debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu