మరోసారి విజయ్ సేతుపతి - ఎన్టీఆర్ కాంబోపై షాకింగ్ న్యూస్.. ఈసారైనా సెట్టవుతుందా?
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి ప్రతి సినిమాకు కామన్ అని అందరికి తెలిసిందే. అందులో కొన్ని అబద్ధాలుంటాయి. మరికొన్ని నిజాలు ఉంటాయి. ఇక కొందరు సడన్ గా మార్పులు కూడా చేయవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ - విజయ్ సేతుపతి కాంబినేషన్ మరోసారి వార్తల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే వీరు కలిసి నటిస్తున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

చివరి షెడ్యూల్..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాను ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ఇంతవరకు తారక్ షూటింగ్స్ లలో పాల్గొనలేదు. ఇక దర్శకధీరుడు రాజమౌళి చివరి షెడ్యూల్ ను జులైలోనే స్టార్ట్ చేయవచ్చని తెలుస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన కొన్ని సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట.

మొదటిసారి పాన్ ఇండియా మూవీ
ఇక ఆ సినిమా అనంతరం తారక్ కొరటాల శివతో మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కొరటాల కూడా మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమాను టచ్ చేయడంతో ఒక్కసారిగా అంచనాల డోస్ పెరిగిపోయింది. ఇక ఆ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

బడా స్టార్స్ పై కన్నేసిన ప్రశాంత్ నీల్
ప్రభాస్ సలార్ సినిమాను నెలరోజుల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్న ప్రశాంత్ ఇదే ఏడాది ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసుకొనున్నట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఎన్టీఆర్ సినిమాలో మాత్రం విలన్ రోల్ తో పాటు మరొక సపోర్టింగ్ రోల్ కోసం మాత్రం స్టార్స్ పేర్లను ఆలోచిస్తున్నారు.
Recommended Video

త్రివిక్రమ్ దర్శకత్వంలో...
అయితే ఇదివరకే ఒకేసారి జూనియర్ ఎన్టీఆర్, విజయ్ సేతుపతి కాంబినేషన్ పై ఒక టాక్ వచ్చింది. మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ అని కథనాలు వచ్చాయి. ఇక ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆ వార్తలను అందరూ మర్చిపోయారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాలో కూడా అతను కూడా ఉండబోతున్నట్లు టాక్ వస్తుండడంతో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











