నందమూరి ఫ్యాన్స్ లేకుండానే ‘ఊసరవెల్లి’

By Bojja Kumar

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి" విడుదలకు సమయం దగ్గర పడుతోంది. అయితే నందమూరి అభిమానుల్లో మాత్రం సందడి లేదు. అసలు కొందరు నందమూరి అభిమానులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తే చూడం లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. దీనికి ఓ బలమైన కారణం సినీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. బాలయ్య శ్రీరామరాజ్యం సినిమా పూర్తయి విడుదలకు సిద్దంగా ఉంది వాస్తవానికి ఆ సినిమా అక్టోబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నా బలవంతంగా విడుదల వాయిదా వేసుకున్నారు.

కారణం జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా అక్టోబర్ 6న విడుదలకు సిద్దం కావడమే. ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు ఒకే సారి విడుదలైతే ఇబ్బందుల తప్పవని భావించిన అభిమానులు, శ్రీరామరాజ్యం సినిమా నిర్మాతలు...చిన్నోడు కాబట్టి జూ.ఎన్టీఆర్ ను తన ఊసరవెల్లి విడుదల వాయిదా వేసుకోవాలని కోరారు. అయితే జూనియర్ బాబాయ్ బాలయ్య సినిమాను పట్టించుకోక పోగా, ఎవరెలా పోతే నాకేంటి నా సినిమా నా ఇష్టం వచ్చినప్పుడు విడుదల చేసుకుంటా అని తేల్చి చెప్పాడట. దీంతో హర్టయిన అభిమానులు జూనియర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఊసరవెల్లికి దూరంగా ఉంటున్నారు.

మరో వైపు బాలయ్య, చంద్రబాబు అంటే ఇష్టపడే నందమూరి ఫ్యాన్స్ కూడా...ఊరసవెల్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కారణం జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణకు మద్దుతుగా చంద్రబాబు, బాలయ్యలకు యాంటీగా పాలిటిక్స్ నడిపిస్తుండటమేననే వాదన వినిపిస్తోంది. నందమూరి అబిమానుల సపోర్టు లేకుండా 'ఊసరవెల్లి" భవిష్యత్ ఎలా ఉండ బోతోందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X