twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన స్టార్ హీరోలు... రెమ్యునరేషన్స్ -2(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : బయిట అన్నీ పెరుగుతున్నాయి... దానికి తగ్గట్లు సినిమా బడ్జెట్ లు పెరిగిపోతున్నాయి. వాటికి తగ్గట్లే హీరోల రెమ్యునేషన్స్ పెంచుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునేషన్స్ అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్ పెరుగుతున్నప్పుడు రెమ్యునేషన్ పెంచటంలో తప్పేమి అన్నట్లు హీరోలు డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతూండటంతో నిర్మాతలు వెనకడుగు వేయటం లేదు.

    ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రెమ్యునేషన్స్ అందరికీ ఆశ్చర్యపరిచే రీతిలో పెరిగాయి. అయితే హీరోలను చూపించే బిజినెస్ చేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు అనివార్యం. చాలాసార్లు ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయమై చర్య తీసుకోవాలని, హీరోల రెమ్యునేషన్స్ పై కోత విధించాలని నియమ,నిబంధనలు పెట్టింది. అయితే దాన్ని పెద్ద నిర్మాతలే ఉల్లంగించారు.

    డిమాండ్,సప్లై రూల్ ...హీరోల రెమ్యునేషన్ విషయంలో జరుగుతూంటుంది. హీరోలు మేమేమన్నా ఎక్కువ అడుగుతున్నామా...అంతా నిర్మాతలే పెంచుతున్నారు..ఇస్తున్నారు..అయినా మమ్మల్ని చూపించి బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం తీసుకోవటంలో తప్పేముంది అని వాదిస్తున్నారు.

    గమనిక : క్రింద పేర్కొన్న హీరోల రెమ్యునేషన్స్ ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి మాత్రమే..అవి ఖచ్చితమైన లెక్కలు కావచ్చు..కాకపోవచ్చు....పెరగవచ్చు..తగ్గవచ్చు... పూర్తి పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

    హీరోలు...రెమ్యునేషన్స్... స్లైడ్ షోలో...

    రవితేజ

    రవితేజ


    మాస్ రాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ కు బలుపు తో మళ్లీ కెరీర్ బ్రేక్ వచ్చింది. ఆయన తాజా చిత్రం పవర్ కి ఏడు కోట్లు వరకూ తీసుకుంటున్నారు.

    సుదీప్

    సుదీప్


    ఈగ విలన్, కన్నడ మిర్చి హీరో సుదీప్ కు తెలుగు, కన్నడంలో మంచి మార్కెట్ ఉంది. ఆయన రీసెంట్ గా ఓ తమిళ సినిమాకు సైన్ చేసారు. అక్కడ ఆయనకు 6 కోట్లు పే చేస్తున్నారు.

    బాలకృష్ణ

    బాలకృష్ణ


    రెమ్యునేషన్ విషయంలో బాలకృష్ణ కొంచెం వెనక పడ్డారనే చెప్పాలి. రీసెంట్ గా లెంజండ్ చిత్రానికి గానూ ఆయన ఆరు కోట్లు తీసుకున్నారని సమాచారం.

    నాగార్జున

    నాగార్జున

    రీసెంట్ గా మనం తో హిట్ కొట్టిన నాగార్జున ..అంతకు ముందు చిత్రం భాయ్ కు ఆరు కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.

    వెంకటేష్

    వెంకటేష్



    వరస ఫ్లాఫుల వెంకటేష్ ..వాటికి సంభంధం లేకుండా ఆరు కోట్లు వసూలు చేస్తున్నారు. దృశ్యం చిత్రానికి ఆయన ఈ మొత్తానికే సైన్ చేసినట్లు తెలుస్తోంది.

    నాగ చైతన్య

    నాగ చైతన్య

    రీసెంట్ గా మనంతో ఫామ్ లో కి వచ్చిన అక్కినేని నాగచైతన్య... తన ఆటోనగర్ సూర్య చిత్రానికి గానూ 2.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

    యష్

    యష్

    కన్నడంలో యంగ్ హీరో యష్ కి మంచి మార్కెట్ ఉంది. వరస హిట్లతో దూసుకుపోతున్న అతనికి అక్కడ 2.5 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. కన్నడ సిని పరిశ్రమలో ఆ రెమ్యునేషన్ చాలా ఎక్కువ.

    నాని

    నాని

    ఈగ చిత్రంతో తమిళంలోనూ మార్కెట్ సంపాదించుకున్న నాని ...కృష్ణవంశీతో చేసిన పైసా చిత్రానికి 2.5 కోట్లు వసూలు చేసారు.

    అల్లరి నరేష్

    అల్లరి నరేష్

    వరస కామెడీలతో దూసుకుపోతున్న అల్లరి నరేష్ కూడా సుడిగాడు చిత్రం నుంచి తన రేటు ని పెంచారు. ఆయన జంపు జిలాని చిత్రానికి రెండున్నర కోట్లు తీసుకున్నారు.

    గోపీచంద్

    గోపీచంద్

    వరస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్...యేలేటి తో చేసిన సాహసం చిత్రానికి గానూ రెండు కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నారు.

    దునియా విజయ్

    దునియా విజయ్

    ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో నలిగిన దునియా విజయ్...తన తాజా కన్నడ చిత్రానికి రెండు కోట్లకు సైన్ చేసారు.

    మోహన్ లాల్

    మోహన్ లాల్


    మళయాళ చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి రెమ్యునేషన్స్ బాగా తక్కువ. అక్కడ మోహన్ లాల్ కోటిన్నర చిత్రానికి రెమ్యునేషన్ గా తీసుకుంటున్నారు.

    ముమ్మట్టి

    ముమ్మట్టి


    మోహన్ లాల్ తో సమానంగా ముమ్మట్టి సైతం రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. ఆయన కూడా సినిమాకు కోటిన్నర వసూలు చేస్తున్నారు.

    సునీల్

    సునీల్


    కమిడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్ ఈ మధ్యనే హిట్టైన తడాఖా చిత్రానికి గానూ కోటిన్నర వసూలు చేసారు.

    గణేష్

    గణేష్


    ముంగారమలై హిట్ తో ఓ రేంజికి ఎదిగిన గణేష్ కు ఈ మధ్యన విజయాలు కరవుయ్యాయి.. అయితే ఆయన రోమియో, శ్రావణి సుబ్రమణ్య చిత్రాలకు కోటిన్నర వసూలు చేసిన్నట్లు కన్నడ చిత్ర పరిశ్రమ చెప్తోంది.

    పృద్వీరాజ్

    పృద్వీరాజ్

    మళయాళ చిత్ర పరిశ్రమలోని యువ హీరోల్లో తనకంటూ క్రేజ్ తెచ్చుకుని దూసుకుపోతున్న పృధ్వీరాజ్ ...తన లేటెస్ట్ చిత్రానికి గానూ కోటి రూపాయలుకు సైన్ చేసారు.

    దిగంత్

    దిగంత్

    ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ రీసెంట్ గా ఓ బాలీవుడ్ చిత్రం చేసారు. అందుకు గానూ ఆయన కోటి రూపాయల వరకూ ఛార్జ్ చేసారు.

    English summary
    The salary of a few actors in South is almost equal to that of a few Bollywood superstars. We bring you the list of highest paid actors in South Indian film industry. Continue to see your favourite hero's remuneration in the slideshow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X