twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పద్మ' లిస్ట్ లో సూపర్ స్టార్..మరో ఇద్దరు సినిమావాళ్లు

    By Srikanya
    |

    న్యూఢిల్లీ : ఈ ఏడాది 'పద్మ' అవార్డులకు వచ్చే అవకాసం ఉండి, సిఫారసు చేయబడిన వారి లిస్ట్ నుండి ముగ్గరు పేర్లు బయిటకు వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ... సినీ ఇండస్ట్రీకు సేవలు చేసినందుకు కానూ ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చే అవకాసం ఉంది. అలాగే అనుపమ ఖేర్ పద్మ భూషణ్ అవార్డ్, ప్రియాం చోప్రాకు పద్మశ్రీ అవార్డ్ రేసులో ఉన్నారు. జనవరి 26న గవర్నమెంట్ ఈ అవార్డ్ లను అఫీషియల్ గా ప్రకటిస్తారు.

    క్రితం సంవత్సరం కూడా రజనీకాంత్ ని అవార్డ్ వరిస్తుందని అనుకున్నారు. అయితే ఆ తర్వాత పేర్లు తొలగించారు. అప్పట్లో పేర్లు తొలిగించిన 1,793 మంది ప్రముఖ వ్యక్తుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్, యోగా గురువు రామ్‌దేవ్ బాబా, బిజెపి నాయకుడు, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా తదితరులు ఉన్నారు. ఆధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయి, భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ బ్లాక్‌విల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్, పారిశ్రామికవేత్త బ్రిజ్ మోహన్‌లాల్ ముంజల్ తదితరులను కూడా సిఫారసు చేసినప్పటికీ వారి కూడా పద్మ అవార్డులకు ఎంపిక కాలేదు.

    Padma Vibhushan for Superstar Rajani

    2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు అందుకున్న రజనీకాంత్‌ను ఈసారి రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్' అవార్డుకు సిఫారసు చేశారు. అయితే క్రితం ఏడాది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌లను పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.

    ది పద్మ అవార్డులకు సిఫారసు చేయబడిన ఇతర ప్రముఖుల్లో మళయాళ సినీ స్టార్ మోహన్‌లాల్, జమ్మూ-కాశ్మీరు బిజెపి నేత దరాక్షన్ అంద్రాబీ, అథ్లెట్ అంజూ బాబీ జార్జ్, బ్యుటీషియన్ షహనాజ్ హుసేన్, సినీ నిర్మాత రోహిత్ శెట్టి, అపోలో హాస్పిటల్స్ ఎండి ప్రీతా రెడ్డి, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఉన్నారు. పద్మ అవార్డులకు పేర్లను ఖరారు చేయడానికి ముందే తాను ఈ అవార్డును స్వీకరించబోనని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు.

    English summary
    Superstar Rajinikanth is likely to be honoured with the Padma Vibhushan award for his services to the Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X