twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని ‘పైసా’రిలీజ్ ఆగటం వెనక అసలు సమస్య?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎంతో కాలంగా విడుదలకు నోచు కోకుండా వాయిదాలు పడుతూ వస్తున్న 'పైసా' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు ఇచ్చారని మురిసిపోయేలోగా మళ్లీ వాయిదా పడే అవకాసం ఉందని ట్రేడ్ లో వార్తలు వినపడుతున్నాయి. కేథరిన్, సిద్ధిక శర్మ హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ఫైనల్ చేసినట్లు చెప్పారు. అయితే ఇంకా ఫైనాన్స్ లు క్లియర్ కాలేదని,అనుకున్న తేదీకి విడుదల కావటం కష్టమేనని అంటున్నారు.

    ట్రేడ్ లో చెప్పుకుంటున్న సమాచారం బట్టి... చిత్రం దాదాపు 18 కోట్ల భారీ బడ్జెట్ తో తయారైందని, నాని మార్కెట్ ని అస్సలు లెక్కలోకి తీసుకోకుండా తీసారని, దాంతో ఆర్దిక ఇబ్బందులు ఓ రేంజిలో ప్రారంభమయ్యాయని అంటున్నారు. నిర్మాత ప్రస్తుతం 12 కోట్లు దాకా ఉషా బాలకృష్ణ,అలంకార్ ప్రసాద్ లకు ఫైనాన్స్ లు క్లియర్ చేయాలని,అప్పటివరకూ రిలీజ్ ఉండదని అంటున్నారు. అయితే ఇందుకోసం నిర్మాత శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

    ఈ సినిమాకు కృష్ణవంశీ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడని, అది నాని మార్కెట్ ని దాటి పోయిందని, అలాగే కృష్ణవంశీ కి ప్రత్యేకమైన మార్కెట్ వరస ఫ్లాపులతో ఇప్పుడు లేకపోవటం కూడా ఇబ్బంది ఎదురువు అవుతోందని అంటున్నారు. ఎక్కువ రేట్స్ చెప్పటంతో కొనుక్కునేవాళ్లు వెనక అడుగు వేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

    నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

    కృష్ణ వంశీ మాట్లాడుతూ.... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

    English summary
    Nani - Krishna Vamsi 's Paisa which is facing financial issues is gonna be longer. The film has gone over budget at 18Cr appx which is huge for Nani's market and the producer who already owe some huge amounts due to previous failures is completely struggling to release the film. He has to clear almost 12Cr in finances mostly to Usha Balakrishna & Alankar Prasad. The film as things stand now looks unlikely to release on 29th November. It will be no surprise if it doesn't make it even in December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X