»   » సీన్ లోకి రామ్ చరణ్ ... నానికి రిలీఫ్

సీన్ లోకి రామ్ చరణ్ ... నానికి రిలీఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎంతో కాలంగా విడుదలకు నోచు కోకుండా వాయిదాలు పడుతూ వస్తున్న 'పైసా' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురవాటనికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం బయటపడటం వెనక మెగా క్యాంప్ హస్తం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ తో మెగా హీరో రామ్ చరణ్ నెక్ట్స్ ఉండటం ప్లస్ అయ్యిందంటున్నారు. రిలీజ్ ఆగిపోయిన దర్శకుడుతో చిత్రం అంటే బిజినెస్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించిన మెగా క్యాంప్....'పైసా' రిలీజ్ కోసం తమ వంతు ప్రయత్నం చేసారు. దాని ఫలితమే రిలీజ్ డేట్ అంటున్నారు.

కృష్ణవంశీ మాట్లాడుతూ...పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా. మా హీరో పైసల కోసమే పోరాటం చేశాడు. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.

Paisa: Mega camp saved Nani

అలాగే... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

నిర్మాత మాట్లాడుతూ ''పేరుకు తగ్గట్టుగా పైసా వసూల్‌ సినిమా ఇది. టిక్కెట్టు రేటుకు తగిన వినోదం గిట్టుబాటు అవుతుంది. కృష్ణవంశీ శైలిలోనే విభిన్నంగా సాగే ఈ సినిమా నాని కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతం: సాయికార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రాజారవీంద్ర.

English summary
Film Nagar birds are cuckooing that Mega camp made all the ends meet such that Paisa will release and all those blemishes on Krishna Vamsi will get cleared to a shine. That will allow them to project Charan’s project in a big way, and there is no negativity about the director too. Nani, Catherine Tresa's ‘Paisa directed by Krishna Vamsi is finally releasing on Feb 7th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu