»   » ఎన్టీఆర్‌తో స్టార్ బాలీవుడ్ హీరోయిన్ ఖరారు?

ఎన్టీఆర్‌తో స్టార్ బాలీవుడ్ హీరోయిన్ ఖరారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ మొదలవనుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్స్ వేట మొదలెట్టింది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రాకు ఆ అవకాశం దక్కవచ్చని సమాచారం. ప్రస్తుతం యూనిట్ పరిణీతితో సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. తను గనుక సరేనంటే అదే పరిణీతి తొలి తెలుగు చిత్రం అవుతుంది.

ఇదివరకు కొంతమంది తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. కానీ కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశాల్ని వదులుకొంది పరిణీతి. ఇందులో రెండో హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని ఎంచుకొనే అవకాశాలున్నాయి.

Parineeti Chopra To Romance Jr Ntr in Janatha Garage

ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు కనిపిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ నటుడెవరనే విషయంపైనా ఆసక్తి నెలకొంది. మరో వారం రోజుల్లో ఈ సస్పెన్స్‌ వీడే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న నూతన చిత్ర షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఎన్టీఆర్‌కు ఇది 26వ చిత్రం. 2016 ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఎన్టీఆర్ మాట్లాడుతూ : కొరటాల శివ తో నాకు బృందావనం రోజుల నుండి అనుబంధం ఉంది. అయన ఒక అధ్బుతమైన రచయిత. ఒక అభిరుచి గల డైరెక్టర్. క్లాస్, మాస్ అంశాలను ఆయన బాలన్స్ చేసుకునే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కొరటాల శివ అందించిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మైత్రీ మూవీస్ సంస్థ తో పని చేయటం ఆనందం గా ఉంది అన్నారు.

Parineeti Chopra To Romance Jr Ntr in Janatha Garage

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా అయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను అన్నారు.

'జనతా గ్యారేజ్‌'(వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరుపొందిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' టీజర్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే.

English summary
According to the reports from reliable sources, Parineeti Chopra is going to share screen with Tarak, makers are contacted the heroine and reportedly she accepted the offer. Tentatively the movie title would be as Janatha Garage. Devi Sri composing for this movie. Yerneni Naveen producing this big budget movie under Mythri Movie Makers Banner .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu