For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ..సప్తగిరికి రుణం తీర్చుకోవటం ఏమిటి...అందుకే ఆ నిర్ణయం?

  By Srikanya
  |

  హైదరాబాద్: ఒకప్పుడు విలన్లు హీరోలుగా మారారు. ఇప్పుడు కమిడయన్స్ హీరోలుగా మారి రాణిస్తున్నారు. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు సప్తగిరి తాజాగా హీరో అవతారం ఎత్తబోతున్నారు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్‌ పతాకంపై రవి కిరణ్‌ నిర్మిస్తున్నారు.

  హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'. రోషిణి ప్రకాష్‌ హీరోయిన్. అరుణ్‌ పావర్‌ దర్శకుడు. రవికిరణ్‌ నిర్మాత. ఈనెల 6న ఈ చిత్రంలోని పాటలని విడుదల చేస్తారు.

  ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్టు వార్తలు విచ్చాయి. మొదట్లో దీన్ని పుకారుగా కొట్టిపారేసినా ఈ వార్త నిజమైంది. ఈ ఆడియో పంక్షన్ కు పవన్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

  అయితే పవన్ కళ్యాణ్ ఈ ఆడియో పంక్షన్ కు రావటం వెనక ఓ చిన్న విషయం ఉందని తెలుగు సినీ వర్గాల్లో వినపడుతోంది. అదేమిటంటే..

  నిర్మాత ఖరారు చేసారు

  నిర్మాత ఖరారు చేసారు

  ‘‘ పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా మా పాటల్ని విడుదల చేస్తున్నాం. పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రమిది. హైదరాబాద్‌, పోలాండ్‌, జర్మనీలోని అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయ్‌ బుల్గానిన చక్కని స్వరాలందించారు. మూడోవారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని తెలిపారు.''అన్నారు.

  టైటిల్ త్యాగం చేసారు

  టైటిల్ త్యాగం చేసారు

  పవన్ నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' టైటిల్‌ని మొదట సప్తగిరి అండ్ టీమ్ ఈ చిత్రం కోసం చేయించుకున్నాడట. అయితే పవన్ టీమ్ అడగడంతో త్యాగం చేసి ఇప్పుడు సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనే టైటిల్‌ని పెట్టినట్టు సమాచారం.

  అత్తారింటికి దారేదిలోదే

  అత్తారింటికి దారేదిలోదే

  పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత అనేక ఆలోచనలు చేసి దర్శకులను మార్చి తీస్తున్న సినిమాకు అనేక చర్చలు చేసిన తరువాత ఆ సినిమాకు ఎట్టకేలకు 'కాటమరాయుడు' అన్న టైటిల్ ఫిక్స్ చేసి పవన్ పుట్టినరోజునాడు హడావిడిగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడ వదిలారు. అలాగే పవన్ కు రికార్డులు తెచ్చి పెట్టిన 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ పాడిన 'కాటమరాయుడా' పాట గుర్తుకు వచ్చేలా ఈ కొత్త సినిమా టైటిల్ సెంటిమెంట్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

  పెద్దలతో పరిచయం, పవన్ నిర్ణయం్

  పెద్దలతో పరిచయం, పవన్ నిర్ణయం్

  అలా తన చిత్రానికి అడగ్గానే టైటిల్ ఇచ్చేయంతో ఆ రుణాన్ని తీర్చుకోవడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేగాక అరుణ్ పవర్‌కి ఇండస్ట్రీ బిగ్ హెడ్స్‌తో పరిచయం ఉండడంతో ఇది సాధ్యమైందంటున్నారు. ఏదైమైనా పవన్ ఈ ఆడియోకి రావటంతో ...సప్తగిరి బంపర్ ఆఫర్ కొట్టినట్టే అంటున్నారు.

  అసెస్టెంట్ గా చేసిన అనుభవంతో

  అసెస్టెంట్ గా చేసిన అనుభవంతో

  ‘‘తిరుడన్ పోలీస్‌' సినిమా చూసి నచ్చడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో నేనే కథ రాసుకున్నాను. అరుణ్‌ పవార్‌ చక్కగా తెరకెక్కించాడు. పాటలు ఆకట్టుకుంటాయి. హాస్యనటుడిగా ఉన్న నేను హీరోగా మారాను. ఇది నా జీవితంలో పెద్ద ముందడుగు. ఈ సినిమా పట్ల చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నన్ను నమ్మి ఇంత బడ్జెట్‌ తో సినిమా చేసే నిర్మాత ఇంకెవరూ ఉండరు. తమిళ సినిమా తిరునడ పోలీస్‌ నచ్చడంతో నేనే స్క్రిప్టు రాసుకున్నాను. మంచి నిర్మాణ విలువలు, వినోదాత్మకమైన కథాకథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.'అన్నారు.'' అని తెలిపారు.

  మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు

  మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు

  ‘‘మాస్‌ ఆడియెన్స పల్స్‌ బాగా తెలిసిన నటుడు సప్తగిరి. హిట్‌ సినిమా కథను నాకు ఇచ్చాడు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడం కోసం టీమ్‌ అంతా కృషి చేశాం'' అని అన్నారు.

  తండ్రి కొడుకల మధ్య

  తండ్రి కొడుకల మధ్య

  ‘‘తమిళంలో హిట్టైన ‘తిరుడన పోలీస్‌' కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ చిత్రం తీశాం. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంతోపాటు పోలీస్‌ వ్యవస్థ గురించి కొన్ని విషయాలను ఇందులో చూపిస్తున్నాం'' అని నిర్మాత చెప్పారు.

  మంచి అప్లాజ్ వచ్చింది

  మంచి అప్లాజ్ వచ్చింది

  ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ వెల్లడించారు.

  సప్తగిరిది ఆ సినిమా క్రెడిట్

  సప్తగిరిది ఆ సినిమా క్రెడిట్

  సప్తగిరికి కెరీర్ కు హిట్ ఇచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విజయంలో సప్తగిరి కూడా ఓ భాగమే. అతను హీరోగా మారడం ఆనందంగా ఉంది''అన్నారు.

  తొందరపడలేదు

  తొందరపడలేదు

  మారుతి చెబుతూ ''సప్తగిరిని హీరోగా మారమని చాలామంది చెప్పాం.కానీ తొందర పడలేదు. ఓ మంచి కథ కోసం ఎదురుచూశాడు. తనకు అరుణ్‌లాంటి మంచి దర్శకుడు దొరికాడు''అన్నారు.

  ఈ సినిమాకు ఎంత పెట్టారంటే

  ఈ సినిమాకు ఎంత పెట్టారంటే

  అయితే ఈ సినిమా కోసం నిర్మాత రూ.7 కోట్ల బడ్జెట్ ని వెచ్చించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్‌కి చక్కని స్పందన రావటంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు నిర్మాతలు. పోస్టర్‌కి సామాజిక మాధ్యమాల్లోనూ విశేషమైన క్రేజు వచ్చింది. రామ్ ప్రసాద్ కెమెరా సినిమాకి ప్రధాన బలం. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌, ఆడియో లాంచ్ చేసి, ఇదే హుషారులో త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కిరణ్ తెలిపారు.

  ఇవే ఈ సినిమాకు క్రేజ్ తెచ్చినవి

  ఇవే ఈ సినిమాకు క్రేజ్ తెచ్చినవి

  ఈ సినిమా ప్లస్ ల విషయానికి వస్తే.. టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ భామ రోషిని ప్రకాశ్ ఈ సినిమాలో సప్తగిరి సరసన నటిస్తోంది. గతంలో మురారి, లెజెండ్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన సి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకు విజువల్స్ అందించారు. హైదరాబాద్, పోలాండ్, జర్మనీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ జరిగింది.

  కేవలం హీరోగానే కాదు

  కేవలం హీరోగానే కాదు

  హీరోగా చేస్తున్నంత మాత్రాన తన రెగ్యులర్ ట్రాక్ కు బ్రేక్ ఇవ్వకూడదనుకున్నట్లున్నాడు సప్తగిరి. కమెడీయన్ గా సప్తగిరి రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారేందుకు ఈ నవ్వుల గిరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన హారర్ కామెడీ అభినేత్రిలో నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగానే నవ్వించాడు సప్తగిరి.

  పొల్యూషన్ గిరి

  పొల్యూషన్ గిరి

  మగజాతి ఆణిముత్యం - పొల్యూషన్ గిరిలాంటి పాత్రలతో రక్తికట్టించిన సప్తగిరి అలియాస్ నెల్లూరు గిరి చైనీస్ వారియర్ గా నవ్వులు పువ్వులు పూయించాడు. సునీల్ హీరోగా నటించిన `జక్కన్న` సినిమాలో పాత్రకు మంచి పేరే వచ్చింది. అందులో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ సునీల్ నే భయపెట్టాడు సప్తగిరి. నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా? అని సప్తగిరి అంటే నీకు గీతా ఆర్ట్స్ తెలుసా? అని సునీల్ కౌంటర్ ఇచ్చాడు. ఆ పంచ్ బాగానే పేలింది.

  సప్తగిరి బిజీ వెనక

  సప్తగిరి బిజీ వెనక

  గత కొంత కాలంగా టాలీవుడ్ లో చాలా మంది సీనియర్ కామెడియన్స్ ఏవీఎస్, దర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, కొండవలస నుంచి జూనియర్ కమెడియన్స్ పొట్టి రాంబాబు వంటి వారు మృతి చెందిన సంగతి విధితమే... అంతేకాదు, ప్రస్తుతం ఉన్న సీనియర్ కామెడియన్స్ బోర్ కొట్టేయడంతో యంగ్ కమెడియన్స్ వైపు అందరి చూపు ఉంది. దాంతో సప్తగిరి బిజి అయ్యిపోయారు

  రోజుకు సప్తగిరి రేటు.

  రోజుకు సప్తగిరి రేటు.

  స్టార్ కమెడియన్ గా మారిన సప్తగిరి కి డిమాండ్ పెరగడంతో పారితోషకాన్ని పెంచేశాడట. సప్తగిరి రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకు తీసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరీ చిన్న సినిమలైతే... లక్ష, కొంచెం పెద్ద సినిమాలైతే... లక్షన్నర వరకూ డిమాండ్ చేస్తున్నాడట. ఇలాగైతేనే సినిమాలను చేస్తానని... లేదంటే లేదని కానీ పారితోషకం తగ్గించుకొనేది లేదని చెప్పడంతో నిర్మాతలు షాక్ తింటూ... సప్తగిరి కు ఉన్న డిమాండ్ దృష్ట్యా అడిగినంత ఇస్తున్నారట.

  సునీలా..సప్తగిరి ..ఇద్దరిలో ఎవరు

  సునీలా..సప్తగిరి ..ఇద్దరిలో ఎవరు

  ఇక బ్రహ్మానందం తర్వాత ఆయనలా కామెడీలో ఆ స్ధాయికి చేరుకున్నవారు లేరు. సునీల్ ఆ స్లాట్ ని ఫిల్ చేస్తాడనుకున్నారు. అయితే హీరోగా టర్న్ తీసుకున్నాడు. బ్రహ్మానందం నుంచి, అలీ, వేణు మాధవ్, దన్ రాజ్, వెన్నెల కిషోర్ ల వరకూ అందరూ హీరోగా ట్రై చేసి ఆ ప్లేస్ ని భర్తీ చేయలేకపోయారు. మరి ఇప్పుడు సప్తగిరి టర్న్ వచ్చింది. హీరోగా ట్రై చేస్తున్నాడు. మరి కెరీర్ లో హీరోగా ఎదుగుతాడో లేదో చూడాలి.

  కంటిన్యూగా...ఆఫర్స్

  కంటిన్యూగా...ఆఫర్స్

  హ్యాపీడేస్' సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ 'పరుగు' మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం'లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి సప్తగిరికి. అలా సందీప్ కిషన్ మూవీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో బాగా పాపులర్ అయ్యాడు. తన మార్కు డిఫరెంట్ కామెడీని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా హిట్ లో ముఖ్య పాత్ర సప్తగిరిది ఉందంటే అతిశయోక్తి కాదు.

  సప్తగిరి ఎక్సప్రెస్ కు పనిచేసినవాళ్లు

  సప్తగిరి ఎక్సప్రెస్ కు పనిచేసినవాళ్లు

  శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని కరుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌.

  English summary
  comedian Sapthagiri is making his debut a hero and the movie has been titled Sapthagiri Express. Pawan Kalyan assured the team to attend the audio launch that will take place on November 6th in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X