»   »  పేరుకే సంపత్ నంది డైరెక్టర్...అంతా పవన్ కళ్యాణే?

పేరుకే సంపత్ నంది డైరెక్టర్...అంతా పవన్ కళ్యాణే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. సినిమా ఇంకా మొదలు కానప్పటికీ.....ముందస్తుగా పక్కా ప్లానింగుతో రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు. దర్శకుడు సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కాగా ఈ చిత్రం గురించి ఫిల్మ్ నగర్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దర్శకుడు సంపత్ నంది కేవలం పేరుకే దర్శకుడని.....సినిమా అంతా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ప్రకారమే ముందుకు సాగుతోందని, సంపత్ నందిని రచయితగా, కో-డైరెక్టర్‌గా, తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అసిస్టెంటుగా పవన్ వాడుకుంటున్నాడని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తూ...తన భవిష్యత్ బాగుటుందనే ఉద్దేశ్యంతో సంపత్ నంది కూడా చెప్పినట్లు వింటున్నాడని టాక్. 'గబ్బర్ సింగ్' చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌ను 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు నుంచి తప్పించడానికి కారణం కూడా అదే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ దర్శకత్వ శాఖలో వేలు పెడుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇతర వివనాల్లోకి వెళితే...గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

విడుదల తేదీ విషయంలో కూడా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
There is a talk in the film industry that, Pawan is involving every where in ‘Gabbar Singh 2’, it looks like Sampath doesn’t really have a chance to show his mettle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu