»   » లాభాల వ్యూహం: పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాలో సూపర్ స్టార్?

లాభాల వ్యూహం: పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాలో సూపర్ స్టార్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తెలుగులో మోహన్ లాల్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన నటించిన పలు మళయాల తెలుగులోనూ విడుదలై మంచి విజయం అందుకున్నాయి. త్వరలో ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిల్మ్ నగర్ వర్గాల అందుతున్న సమాచారం ప్రకారం... ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో రాబోతున్న సినిమాలో మోహన్ లాల్ ను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఇటీవల నిర్మాత రాధాకృష్ణ, త్రివిక్రమ్ కలిసి త్రివేండ్రమ్ వెళ్లి మోహన్ లాల్ ను కలిసి ఈ సినిమా విషయమై చర్చించి, కథ వివరించినట్లు తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ తరహాలోనే ఈ కథలో కూడా తన పాత్ర చాలా కీలకంగా ఉండటం, కథ కూడా కొత్తగా ఉండటంతో వెంటనే మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

కాల్షీట్ల విషయంలో ఆలస్యం

కాల్షీట్ల విషయంలో ఆలస్యం

అంతా ఒకే అయింది కానీ...కాల్షీట్లు కేటలాయించే విషయంలోనే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్ ఖరారైతే తప్ప ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు.

లాభాల వ్యూహమేనా?

లాభాల వ్యూహమేనా?

మోహన్ లాల్ తో కీలకమైన పాత్ర చేయించడానికి సినిమాకు భారీగా లాభాలు రాబట్టాలనే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మోహన్ లాల్ నటిస్తే ఆ సినిమాలకు మళయాలంలో కూడా మంచి వసూళ్లు వస్తాయి. ఎంత కాదన్నా రూ. 10 నుండి 20 కోట్లు అదనంగా కలిసొస్తుందని టాక్.

 సినిమా ఎప్పుడు ఎప్పుడు?

సినిమా ఎప్పుడు ఎప్పుడు?

అయితే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయమై సరైన క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడితో పాటు నేసన్ దర్శకత్వంలో మరో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. దీంతో పాటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

తమ్ముడికి నేనవసరం లేదు, వాడిది భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

తమ్ముడికి నేనవసరం లేదు, వాడిది భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

తమ్ముడికి నేనవసరం లేదు, వాడిది భయంకరమైన క్యారెక్టర్ అంటూ మెగాబ్రదర్ నాగబాబు... పవన్ కళ్యాణ్ గురించి పలు ఆశ్చర్యకర, సంచలన విషయాలు బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Rumours are rife that Mohanlal has got another big Telugu project in his kitty. According to the reports, Mohanlal is being considered for an important role in Pawan Kalyan's next film, which would be directed by popular Telugu film-maker Trivikram Srinivas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu