Don't Miss!
- News
Budget 2023: మొత్తం బడ్జెట్లో 13 శాతం వాటా ఈ రంగానిదే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ OG మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఆ రీమేక్ వల్ల అడ్డం తిరిగిన కథ
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులను ప్రకటిస్తూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పలు సినిమాలను లైన్‌లో పెట్టుకుని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్న పవన్.. ఇటీవలే తన మరో కొత్త ప్రాజెక్టును సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ ప్రాజెక్టు మాఫియా బ్యాగ్‌డ్రాప్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో రూపొందనుంది. ఇప్పటికే దీని నుంచి వదిలిన పోస్టర్‌కు భారీ స్పందన వచ్చింది. అదే సమయంలో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇది ప్రకటించిన తర్వాత నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మరింత ఆలస్యం కాబోతుందని తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాకముందే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించాడు. అయినప్పటికీ ముందుగా ఈ స్టార్ హీరో దీన్నే కంప్లీట్ చేయబోతున్నాడు. ఇక, దీని తర్వాత ఈ మెగా హీరో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలిసింది. దీని తర్వాత 'వినోదయ సీతమ్' రీమేక్‌ను కూడా మొదలెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. అంటే సుజిత్ తెరకెక్కించే చిత్రం వచ్చే ఏడాది కూడా మొదలయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఈ సినిమా 2024లోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్, శ్రీహాన్‌కు షాక్

ఇదిలా ఉండగా.. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో రాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం.