»   » మహేశ్‌, ఎన్టీఆర్‌ రికార్డులకు పవన్ చెక్.. స్పైడర్, జై లవకుశను మించి..

మహేశ్‌, ఎన్టీఆర్‌ రికార్డులకు పవన్ చెక్.. స్పైడర్, జై లవకుశను మించి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తెలుగు అభిమానుల క్రేజ్ భారీగా ఉంది. పవన్ సినిమా వస్తుందంటే ఓవర్సీస్ అడియెన్స్ పండుగే. పవన్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కంటే విదేశాల్లోనే ఎక్కువ హంగామా చేస్తారు. పవన్‌కు మానియాను దృష్టిపెట్టుకొని నిర్మాతలు భారీ మొత్తానికి సినిమాల హక్కులను అమ్ముకొంటారు. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్నది. ఈ చిత్రం టాలీవుడ్ హీరోల రికార్డులను తిరగరాసిందనే మాట వినిపిస్తున్నది.

హిట్లతో మహేశ్, ఎన్టీఆర్ జోరు

హిట్లతో మహేశ్, ఎన్టీఆర్ జోరు

సినిమాల బిజినెస్ విషయంలో ఇప్పటివరకు మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ ఓ రికార్డు ఉన్నది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ భారీ హిట్లను సాధించాడు. మహేశ్ ఖాతాలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చేరింది. వీరిద్దరి సినిమాలకు ఊహించని విధంగా కలెక్షన్ల వరద పారింది. దాంతో వారి సినిమాలంటే ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది.

Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price
వరుస ఫ్లాప్‌లతో పవన్ బేజారు

వరుస ఫ్లాప్‌లతో పవన్ బేజారు

ఇక పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తే ఇటీవల వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నాయి. డిస్టిబ్యూటర్లను భారీగా నష్టాల్లోకి నెట్టాయి. పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

పవన్ సినిమాకు రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్

పవన్ సినిమాకు రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్

రెండు ఫ్లాపుల తర్వాత పవన్ సినిమా కోసం బయ్యర్లు ముందుకొస్తారా అనే అపోహలను తుంగలో తొక్కుతూ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ విషయం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఫస్ట్‌లుక్, టీజర్ ఊసే లేదు..

ఫస్ట్‌లుక్, టీజర్ ఊసే లేదు..

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అసలు ఫస్ట్‌లుక్ గానీ, టీజర్ గానీ రిలీజ్ కాకపోవడం గమనార్హం. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే ఈ రేంజ్‌లో బిజినెస్ చేయడమేంటని ట్రేడ్ వర్గాలు విస్తుపోతున్నాయి.

స్పైడర్, జై లవకుశను మించి వ్యాపారం

స్పైడర్, జై లవకుశను మించి వ్యాపారం

ప్రస్తుతం మహేశ్, మురుగదాస్ స్పైడర్ సినిమా, ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాల్లే. ఈ చిత్రాలకు వచ్చిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ల కంటే పవన్ సినిమా వ్యాపారం అధికంగా ఉండటమనే సంచలనం రేపుతున్నది. వరుస ఫ్లాపులు వెంటాడుతున్నప్పటికీ ఈ రేంజ్‌లో బిజినెస్ చేయడమేంటనే ప్రశ్న ప్రస్తుతం కొందరికి నిద్రపట్టకుండా చేస్తున్నదట.

English summary
Even failures are not stopping Pawan Kalyan's craze. Reports suggest that, Pawan Kalyan, Trivikrams movie has done Rs.90 Crore business in Telugu states. Interesting thing this incident is, the movie have not released any first look poster or movie title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X