For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా...పవన్ కళ్యాణ్ కొన్నారా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం పవన్ కళ్యాణ్. ఆయన వైజాగ్ పోష్ ఏరియాలో స్ధలం కొన్నారంటూ వచ్చిన వార్త గురించే. అయితే ఇది కమర్షియల్ ప్రోపర్టీ కాదని రెసిడెన్షియల్ ల్యాండ్ కాదని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది మాత్రం తెలియటం లేదు. వైజాగ్ ...త్వరలో ఆంధ్రా సినీ రాజధానిగా మారునున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అయినా మరొకరు అయినా స్ధలం కొనుక్కోవటం, లేదా ఇల్లు కొనుక్కోవటం అనేది పెద్ద టాపిక్ గా మాట్లాడుకోవాల్సిన విషయం మాత్రం కాదనేది మాత్రం నిజం.

  పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' విషయానికి వస్తే...

  వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌, నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల'. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

  సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు.

  శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

  దర్శకుడు మాట్లాడుతూ...నిజం వేరు.. నమ్మకం వేరు. రెండింటి మధ్య స్పష్టమైన గీత ఉంది. భక్తి ఆ గీతను చెరిపేస్తుంది. నాస్తికులు మాత్రం అదే గీతను భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. మనం నమ్మేవన్నీ నిజాలు కావు, దేవుడిపై మనకున్నది నమ్మకం కాదు, భయం అని మరో వాదన లేవదీశాడొకాయన. నలుగురి మధ్యో, నాలుగు గోడల లోపలో ఈ ప్రశ్న లేవనెత్తలేదు. ఏకంగా న్యాయస్థానంలోనే చర్చకు తెరలేపాడు. ఆ తరవాత ఏమైందో? ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చిందెవరో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌ పార్థసాని (డాలీ). ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'.

  Pawan Kalyan buys land in Vizag?

  ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వెంకటేష్‌, శ్రియ తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ వారంలో పవన్‌ కల్యాణ్‌ చిత్ర బృందంతో కలుస్తారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ''బాలీవుడ్‌ చిత్రం 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌ ఇది. వెంకటేష్‌, పవన్‌ పాత్రలు మనసుకు హత్తుకొంటాయ''ని యూనిట్ చెబుతోంది.

  సృష్టి లయలకు కారణం నేనే. సమస్త లోకాన్నీ నేనే నడిపిస్తున్నా.. అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా.. అయితే నా కష్టాలకూ ఆయనే బాధ్యుడు..'' అంటూ లాజిక్‌ తీశాడొకాయన. అక్కడితో ఆగలేదు. కోర్టు మెట్లెక్కాడు. న్యాయశాస్త్రంలోనూ ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. చివరికి ఆ కృష్ణుడే దిగి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కథెలా నడిచిందో తెలియాలంటే 'గోపాల గోపాల' చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 45 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు.

  చిత్రం కథ విషయానికి వస్తే..

  దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

  బిజినెస్ విషయానికి వస్తే...

  పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బ్రద్దలు కొడుతూంటాయి. గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' కి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

  అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గోపాల గోపాల' నైజాం రైట్స్ ని 14 కోట్లకు అమ్ముడైంది. ప్రశాంత్ ఫిల్మ్ వారు ఈ ఏరియా పంపిణీ హక్కులు పొందారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం థియోటర్ వరకూ...55 కోట్లు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాత సురేష్ బాబు, శరద్ మరారా లు దాదాపు 20 కోట్లు వరకూ టేబుల్ ప్రాఫెట్ ని లబ్ది పొందుతున్నారని టాక్. ముఖ్యంగా పవన్ గత చిత్రం అత్తారింటికి దారేది కన్నా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ కావటం కలిసి వచ్చే అంశం.

  అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan said to have bought a land in Vizag's posh, busy area.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X