»   » విడాకుల రూమర్లకు పవన్ పుల్‌స్టాప్.. సాక్ష్యాలివిగో..

విడాకుల రూమర్లకు పవన్ పుల్‌స్టాప్.. సాక్ష్యాలివిగో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం మళ్లీ ఇబ్బందుల్లో పడినట్టు ఇంటర్నెట్‌లో ఇటీవల రూమర్లు తెగ షికారు చేస్తున్నాయి. దాంతో మూడో భార్య లెజ్‌నెవాతో విడాకులు తీసుకుంటున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో విస్త్రృతమైంది. ఈ రూమర్లపై పవన్ కల్యాణ్, జనసేన వర్గాలు పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తి పెరిగింది. పలు వెబ్‌సైట్లలో ఇలాంటి రూమర్లకు పవన్ కల్యాన్ తాజా అమెరికా పర్యటన తెరదించింది.

 భార్య లెజ్‌నోవాతో కలిసి బోస్టన్‌కు

భార్య లెజ్‌నోవాతో కలిసి బోస్టన్‌కు

కాటమరాయుడు చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ తన భార్య లెజ్‌నెవా కలిసి వెళ్లడం అనేక రూమార్లకు అడ్డుకట్టవేసింది. అమెరికాలో పర్యటిస్తున్న పవన్ దంపతుల మధ్య సంబంధాలు సానుకూలంగా ఉన్నట్టు ఫొటోల ద్వారా స్పష్టమైంది.

 అభిమానుల ఆందోళనకు పవన్ తెర

అభిమానుల ఆందోళనకు పవన్ తెర


వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్నారనే వార్తలు అభిమానులను, కార్యకర్తలను, చివరకి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేశాయి. తాజా చిత్రాల అలాంటి వివాదాస్పద అంశం వారి మధ్య లేదని సూచనలు కనిపించడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకొన్నారు.

 మూడో భార్యగా లెజ్‌నెవా

మూడో భార్యగా లెజ్‌నెవా


లెజ్‌నెవాతో వివావాహానికి ముందు చేసుకొన్న రెండు పెళ్లిళ్లు వివాదాస్పదంగా మారాయి. వ్యక్తిగత విభేదాల కారణంగా నందిని నుంచి పవన్ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత బద్రి చిత్రంలో నటించిన రేణుదేశాయ్‌ను వివాహం చేసుకొన్నారు. వారికి అఖిరా, ఆరాధ్య పిల్లలు కలిగారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో రేణు, పవన్ విడిపోయారు. అనంతరం లెజ్‌నెవాను వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం వీరిద్దరికి ఓ పాప కూడా పుట్టింది.

 బోస్టన్ సదస్సుకు మాధవన్‌తో కలిసి పవన్

బోస్టన్ సదస్సుకు మాధవన్‌తో కలిసి పవన్


బోస్టన్ జరిగే సమావేశంలో బాలీవుడ్ నటుడు మాధవన్‌తో కలిసి పాల్గొననున్నారు. హర్వర్డ్ యూనివర్సిటీలో 14వ ఇండియా కాన్ఫరెన్స్ 2017 ఫిబ్రవరి 11, 12 తేదీలలో జరుగనున్నది. ఈ సమావేశంలో యువతకు స్ఫూర్తి కలిగించేలా ప్రసంగం చేయనున్నారు.

English summary
Jana sena chief Pawan Kalyan is now in America with his wife Anna Lezhneva. Their visit to the put the curtains the rumours. Before this event there is rumour that Pawan is ready to give divorce to the third wife.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu