»   » పవన్ కళ్యాణ్ పరువు ఇలాకూడా తీస్తారా...!

పవన్ కళ్యాణ్ పరువు ఇలాకూడా తీస్తారా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమనుల అత్యుత్సాహం హీరోల పరువు బజారున పడేస్తోంది. తమ హీరో ఒక సినిమా చేస్తున్నాడనగానే ఎవరికి వారు తమ క్రియేటివిటీ వాడేసి, మార్ఫింగ్ టెక్నిక్కులతో తమ అభిమాన హీరోల తలలకే వేరే వారి శరీరాల్ని తగిలిస్తున్నారు. హీరో అఫిషియల్ గా స్టిల్ రిలీజ్ చేసే వరకు ఆగలేని ఆత్రంతో పరువుని తీసి పారేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం అతడికి తలవంపులు తెచ్చింది.

కాళి సినిమాలో పవన్ లుక్ అంటూ తమిళంలో అజిత్ నటించిన ఏగన్ సినిమా పోస్టర్ ని తెచ్చి మార్ఫింగ్ చేసి నెట్ లోకి వదిలారు. అది కాస్తా పవన్ ఫస్ట్ లుక్ అంటూ కొన్ని వెబ్ సైట్లలో పెట్టారు అది తమిళ్ హీరో అజిత్ బాడీకి పవన్ తల తగిలించగా వచ్చిన స్టిల్ అని తెలిసిన వారు 'పవన్ పరువు ఇలా తీయడం అవసరమా? అంటూ బాధపడిపోతున్నారు. అయితే ఈ మార్పింగులకి నిర్మాతలు కూడా జై కొడుతూ ఉండడం కొసమెరుపు. ఇటీవల బాలకృష్ణతో బెల్లంకొండ తీసే హరహర మహాదేవ సినిమా పోస్టర్లలో దశావతారం పోస్టర్లలో కమల్ తల తీసి బాలయ్య తల పెట్టి..ఆయన పరువు నిలువునా తీసిన వైనం గుర్తుండే ఉంటుంది.

English summary
Pawan Kalyan's upcoming movie 'Shadow'(tentative title) is a very nor kind of film, which is set against mafia background. 'Shadow' is a gangster film about a protagonist on a journey and his fight within himself to discover that you can't fight your own dynasty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu