Just In
- 7 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 7 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 7 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 7 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు...!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘వకీల్ సాబ్’లో పవన్ ఇంట్రడక్షన్ సీన్ ఇదే: ఎవరూ ఊహించని విధంగా.. తెలుగులో అలాంటిది తొలిసారి అలా!
పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకూ సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేస్తూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో సినిమాలకు బ్రేకిచ్చి.. ఇప్పుడు 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ వేళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఇంట్రడక్షన్ సీన్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!
దిశా పటానీ నాటుగా ఫోటోషూట్.. కళ్లతోనే ఘాటుగా కవ్వింపు

లాంగ్ గ్యాప్... వకీల్ సాబ్‌గా రీఎంట్రీ
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్'తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ రూపొందించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించాడు. శృతి హాసన్, అంజలి, అనన్య, నివేదా థామస్ నటించారు.
అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

అంచనాలు భారీగా.. బిజినెస్ కూడా
చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రావడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి అంశం ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మూవీ బిజినెస్ కూడా వంద కోట్లు దాటిపోయింది. తద్వారా రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు బదలయ్యాయి.
యువ హీరోయిన్ కియా గ్లామరస్ ఫోటోషూట్

రెండు రాష్ట్రాల్లో పండుగ.. స్పెషల్ షో
పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్' విడుదలకు సమయం దగ్గరపడడంతో ఆయన అభిమానులు, జనసేన నాయకులు దీనికి తగిన ఏర్పాట్లను ముమ్మరం చేసేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పవన్ మేనియా కనిపిస్తోంది.
అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

పవన్ కోసం మార్పులు చేసిన టీమ్
‘వకీల్ సాబ్'.. బాలీవుడ్ చిత్రం ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను కాపాడే లాయర్‌గా ఇందులో పవన్ నటిస్తున్నాడు. అతడి కంటే ముందే ఈ పాత్రను హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ చేశారు. అయితే, ఆ రెండు భాషల్లో లేని విధంగా ‘వకీల్ సాబ్'లో హీరో పాత్రను బాగా ఎలివేట్ చేసి చూపించబోతున్నారని తెలిసింది.
హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

పవన్ ఇంట్రడక్షన్ సీన్ వివరాలు లీక్
కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియాలో.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్' మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమాలోని పవన్ పాత్ర గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్'లో ఆయన ఇంట్రడక్షన్ సీన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా

తెలుగులో అలాంటిది తొలిసారి అలా
తాజా సమాచారం ప్రకారం.. ‘వకీల్ సాబ్' మూవీలో పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయేలా ఉంటుందట. దాదాపు పది నిమిషాల పాటు ఉండే పార్క్ ఫైట్ సీన్‌తో అతడు పరిచయం అవుతాడని తెలుస్తోంది. తెలుగులో ఏ హీరోనూ చూపించని విధంగా ఈ సీన్‌లో పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది. అది వస్తున్నంత సేపూ ఫ్యాన్స్ సీట్లలో కూర్చోలేరనే టాక్ కూడా వినిపిస్తోంది.