»   » పవన్ కళ్యాణ్ చాలా హాట్..చాలా కూల్: త్రిష

పవన్ కళ్యాణ్ చాలా హాట్..చాలా కూల్: త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, జయంత్ పరాన్జీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'ఖుషీగా…"అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి 'లవ్ ‌లీ" అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం హిందీ హిట్. 'లవ్ ఆజ్ కల్" హిందీ చిత్రం ఆధారంగా కొద్దిపాటి మార్పు చేర్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో తన ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తున్న త్రిష, పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేయాలనే తన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోందని త్రిష అంటోంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతో హాట్ గా ఉండే పవన్, మిగతా సమయాల్లో చాలా కూల్ గా ఉంటాడని త్రిష చెబుతోంది. అలాగే ఈ చిత్ర దర్శకుడు జయంత్ గురించి చెబుతూ..ఆయన తనకు పదేళ్లుగా స్నేహితుడని, అతని దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని కూడా త్రిష పేర్కొంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu