»   » అందుకోసమే పవన్ కళ్యాణ్ లండన్ ప్రయాణం

అందుకోసమే పవన్ కళ్యాణ్ లండన్ ప్రయాణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడ ఆయన నూతన చిత్రం ఖుషీగా(లవ్ ఆజ్ కల్ రీమేక్) లొకేషన్స్ చూడనున్నారు. జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని కమిడియన్ నుంచి నిర్మాతగా మారిన గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పులి..డబ్బింగ్ వర్క్ పూర్తి చేసారు. ఇక కొద్ది రోజుల పాటు లండన్, యూరప్ దేశాల్లో లొకేషన్స్ ని సెర్చ్ చేసి ఆ తర్వాత ఇజ్రాయిల్ చేరుకుంటారు. అక్కడ సింగీతం శ్రీనివాసరావు గారి సినిమా జీసస్ క్రైస్ట్ షూటింగ్ లో పాల్గొంటారు. ఇక ఖుషీగా చిత్రంలో ఇలియానా, కీర్తి కర్భందా హీరోయిన్స్ గా చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu